Amazing Offer: అదిపోయే ఆఫర్.. రూ. 44 వేల ఫోన్ కేవలం రూ.28వేలకే.. గూగుల్ పిక్సెల్ 6ఏపై భారీ డిస్కౌంట్..!

Google Pixel 6a: గూగుల్ పిక్సెల్ 7A స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్ లోకి అడుగుపెట్టేసింది.

Arun Chilukuri
Published on: 12 May 2023 11:27 AM IST
Huge Price Drop on Google Pixel 6a After Google Announced Pixel 7a
X

Amazing Offer: అదిపోయే ఆఫర్.. రూ. 44 వేల ఫోన్ కేవలం రూ.28వేలకే.. గూగుల్ పిక్సెల్ 6ఏపై భారీ డిస్కౌంట్..!

Google Pixel 6a: గూగుల్ పిక్సెల్ 7A స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్ లోకి అడుగుపెట్టేసింది. రూ.43,999 ధర పలుకుతుండగా..లాంఛ్ ఆఫర్ లో భాగంగా కొన్ని బ్యాంకుల క్రెడిట్, డెబిట్ కార్డులపై రూ.4000 తగ్గింపు ఉంది. ఇక పిక్సెల్ 7A రాకతో గూగుల్ తన పిక్సెల్ 6A ధరను భారీగా తగ్గించింది. రూ.16,000 తగ్గిస్తూ గూగుల్ తన ఐ/ఓ కాన్ఫరెన్స్ లో నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో రూ.43,999 ఉన్న పిక్సెల్ 6A ధర..రూ.27,999కి పడిపోయింది.

పిక్సెల్ 6A ఫోన్ అభిమానులంతా ఎంతో కాలంగా ధర తగ్గింపు కోసం ఎదురుచూస్తున్నారు. వారందరినీ గూగుల్ సంస్థ ఖుషీ చేసినట్లయింది. మరిఎందుకు, ఆలస్యం ఫ్లిప్ కార్ట్ లో బుక్ చేసుకొని రూ.27,999కే పిక్సెల్ 6Aను సొంతం చేసుకోండి. మిడ్ రేంజ్ బెస్ట్ స్మార్ట్ ఫోన్ గా చెప్పుకుంటున్న పిక్సెల్ 6A ను 6జీబీ రామ్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ ఉంది. 6.1 ఇంచెస్ డిస్ ప్లే, 4410 mAh బ్యాటరీ 18 వాట్స్ వైర్డ్ ఛార్జింగ్ తో ఫోన్ పని చేస్తుంది.

మార్కెట్ లోకి పిక్సెల్ 6Aను 12OS పై లాంఛ్ చేసినా ఆ తర్వాత 13కు అప్ గ్రేడ్ చేశారు. చాక్, చార్ కోల్, సాగే కలర్ ఆప్షన్స్ లో లభిస్తున్న ఈ 6Aలో డ్యూయెల్ రేర్ కెమెరా సెటప్ ఉంది. 12.2 మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ 12 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, ఫ్రంట్ లో 8 మెగా పిక్సెల్ కెమెరా ఉంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story