Honor X7c: 6000mAh బ్యాటరీతో హానర్ బడ్జెట్ ఫోన్.. ధర ఎంతంటే?

Honor X7c: 6000mAh బ్యాటరీతో హానర్ బడ్జెట్ ఫోన్.. ధర ఎంతంటే?
x
Highlights

Honor X7c : హానర్ తన కొత్త స్మార్ట్‌ఫోన్‌గా హానర్ ఎక్స్7సిని విడుదల చేసింది.

Honor X7c : హానర్ తన కొత్త స్మార్ట్‌ఫోన్‌గా హానర్ ఎక్స్7సిని విడుదల చేసింది. కంపెనీ దీనిని అజర్‌బైజాన్‌లో ప్రారంభించింది. ఇది హానర్ X7b అప్‌గ్రేడ్ మోడల్. Honor కొత్త X-సిరీస్ ఫోన్ octa-core Snapdragon 4 Gen 2 ప్రాసెసర్‌పై నడుస్తుంది. రెండు ర్యామ్, స్టోరేజ్ ఆప్షన్‌లలో అందింస్తుంది. ఫోన్ 6.77 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 35W ఛార్జింగ్ సపోర్ట్‌తో పెద్ద 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో డ్యూయల్ బ్యాక్ కెమెరా సెటప్‌ అందిస్తోంది. ఫోన్ వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కోసం IP64 రేటింగ్‌తో వస్తుంది. ఫోన్ ధర, ఫీచర్ల గురించి వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం.

Honor X7c ర్యామ్, స్టోరేజ్ ప్రకారం రెండు కాన్ఫిగరేషన్‌లలో రానుంది. దీని 6GB + 128GB వేరియంట్ ధర AZN 359 (సుమారు రూ. 17,000) అయితే 8GB + 256GB వేరియంట్ ధర AZN 410 (సుమారు రూ. 20,200). ఇది ఫారెస్ట్ గ్రీన్, మిడ్‌నైట్ బ్లాక్, మూన్‌లైట్ వైట్ కలర్ ఆప్షన్‌లలో లాంచ్ అవుతుంది.

Honor X7c Features

ఫోన్ అడ్రినో 610 GPU, 8GB RAM, 256GB వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. ఫోన్ 5 స్టార్ డ్రాప్ రెసిస్టెంట్ రేటింగ్‌తో వస్తుంది. అంటే పడిపోయినా పగిలిపోదు. ఫోటోగ్రఫీ కోసం ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది.

ఇందులో 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఫోన్‌లో 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఫోన్ 35W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పెద్ద 6000 mAh బ్యాటరీని కలిగి ఉంది. ఫుల్ ఛార్జ్‌పై 59 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ సమయాన్ని ఈ ఫోన్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది.

ఫోన్ బరువు 196 గ్రాములు. నీరు, దుమ్ము నుండి సురక్షితంగా ఉండటానికి ఫోన్ IP64 రేటింగ్‌తో వస్తుంది. 3 నిమిషాల పాటు నీళ్లలో పడేసినా ఏమీ జరగదు. కనెక్టివిటీ కోసం ఫోన్ 3.5 mm ఆడియో జాక్, Wi-Fi 802.11 a/b/g/n/ac, బ్లూటూత్ వెర్షన్ 5, GPS, OTG, USB టైప్-C, NFC వంటి ఫీచర్లకు సపోర్ట్ ఇస్తుంది. భద్రత కోసం ఫోన్‌లో ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. ఇది కాకుండా యాంబియంట్ లైట్ సెన్సార్, కంపాస్, గ్రావిటీ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్ కూడా ఉన్నాయి. ఇది హై-రెస్ ఆడియో సపోర్ట్‌తో డ్యూయల్ స్టీరియో స్పీకర్ సెటప్‌ను కూడా కలిగి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories