Internet Speed: స్మార్ట్‌ఫోన్‌లో ఇంటర్నెట్‌ స్పీడ్‌ తగ్గిపోయిందా.. ఈ తప్పులు ఏమైనా చేశారా చెక్‌ చేయండి..!

Has the Internet Speed Decreased in the Smartphone Check if you Have Done any of These Mistakes
x

Internet Speed: స్మార్ట్‌ఫోన్‌లో ఇంటర్నెట్‌ స్పీడ్‌ తగ్గిపోయిందా.. ఈ తప్పులు ఏమైనా చేశారా చెక్‌ చేయండి..!

Highlights

Internet Speed: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉంటుంది. దీని ద్వారా ఇంటర్నెట్‌ వాడుతూ అన్ని పనులని సకాలంలో సులువుగా చేస్తున్నారు.

Internet Speed: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉంటుంది. దీని ద్వారా ఇంటర్నెట్‌ వాడుతూ అన్ని పనులని సకాలంలో సులువుగా చేస్తున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఒక్కోసారి ఏదైనా పనిచేస్తున్నప్పుడు అకస్మాత్తుగా ఇంటర్నెట్‌ వేగం తగ్గిపోతుంది. దీంతో చేస్తున్న పని మధ్యలోనే ఆపేయాల్సిన పరిస్థితి నెలకొంటుంది. దీనివల్ల వినియోగదారులు చాలా ఇబ్బంది పడుతారు. ఇలాంటి పరిస్థితులలో తిరిగి స్మార్ట్‌ఫోన్‌లో ఇంటర్నెట్‌ వేగం ఎలా పెంచుకోవాలో ఈరోజు తెలుసుకుందాం.

1. వాస్తవానికి సిమ్ కార్డ్‌లో ఏదైనా పగుళ్లుంటే ఇంటర్నెట్‌ సరిగ్గా కనెక్ట్‌ కాదు. దానిని ఇన్‌సర్ట్ చేసేటప్పుడు సిమ్ కార్డ్ స్లాట్‌లో సెట్‌ అయిందా లేదా చూసుకోవాలి. లేదంటే ఇంటర్నెట్‌ వేగం తగ్గుతుంది. అది పూర్తిగా సెట అయితేనే ఇంటర్నెట్‌ వేగంగా ఉంటుంది.

2. స్మార్ట్ ఫోన్ ఇంటర్నెట్ స్పీడ్ తగ్గినప్పుడు వేగం పెంచడం కోసం రెండో స్లాట్‌లో సిమ్ కార్డ్‌ను ఇన్‌స్టాల్ చేసినట్లయితే ముందుగా సిమ్ స్లాట్‌ను క్లీన్ చేయాలి. ఆ తర్వాత మాత్రమే సిమ్ కార్డ్‌ని ఇన్‌సర్ట్ చేయాలి.

3. స్మార్ట్‌ఫోన్‌లో ఇంటర్నెట్‌ స్పీడ్‌గా రావాలంటే సిమ్ కార్డ్‌ను చొప్పించేటప్పుడు సరిగ్గా కనెక్ట్ అయిందా లేదా నిర్ధారించుకోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు సిమ్ కార్డ్ సెట్‌ కాకుంటే ఇంటర్నెట్‌ రాదని గుర్తుంచుకోండి.

4. స్మార్ట్‌ఫోన్‌లో సిమ్ కార్డ్‌ని ఇన్‌సర్ట్ చేసేటప్పుడు ముందుగా ఆ సిమ్ కార్డ్ ట్రేని పూర్తిగా శుభ్రం చేయాలి. ఎందుకంటే సిమ్ కార్డ్ ట్రేలో దుమ్ము, ధూళి ఉంటుంది. దీనివల్ల కూడా ఇంటర్నెట్ స్పీడ్‌ తగ్గుతుంది.

5. స్మార్ట్‌ఫోన్ ప్రైమరీ సిమ్‌ని వేరే సిమ్ స్లాట్‌లో ఇన్‌సర్ట్ చేస్తే ఇంటర్నెట్ స్పీడ్ తగ్గుతుంది. రెండవ స్లాట్‌లో సిమ్ కార్డ్‌ను ఇన్‌సర్ట్ చేయడం వల్ల ఆటోమేటిక్‌గా స్లో అవుతుంది. అందుకే ఎప్పుడైనా ప్రైమరీ సిమ్‌ని మొదటి స్లాట్‌లో ఇన్‌సర్ట్‌ చేయాలి. అప్పుడే ఇంటర్నెట్ స్పీడ్ అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా అంతరాయం లేకుండా ఇంటర్నెట్‌ స్పీడ్‌ని పొందుతారు.

Show Full Article
Print Article
Next Story
More Stories