Google Pixel 9a : ఏంటి భయ్యా ఈ ఆఫర్.. గూగుల్ పిక్సెల్ 9a ఫోన్ మరింత ఇంత తక్కువా?

Google Pixel 9a
x

Google Pixel 9a : ఏంటి భయ్యా ఈ ఆఫర్.. గూగుల్ పిక్సెల్ 9a ఫోన్ మరింత ఇంత తక్కువా?

Highlights

Google Pixel 9a Price : గూగుల్ పిక్సెల్ ఫోన్ కొనేవారికి అదిరిపోయే ఆఫర్.. మంచి కెమెరా ఫోన్ కోసం చూస్తుంటే ఇదే బెస్ట్ టైమ్.. క్లీన్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్ అందించే మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో అందుబాటులో ఉంది.

Google Pixel 9a Price: గూగుల్ పిక్సెల్ ఫోన్ కొనేవారికి అదిరిపోయే ఆఫర్.. మంచి కెమెరా ఫోన్ కోసం చూస్తుంటే ఇదే బెస్ట్ టైమ్.. క్లీన్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్ అందించే మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో అందుబాటులో ఉంది. అదే గూగుల్ పిక్సెల్ 9a ఫోన్. ప్రస్తుతం అమెజాన్‌లో గూగుల్ బడ్జెట్-ఫ్రెండ్లీ పిక్సెల్ ఫోన్ రూ. 9వేల కన్నా ఎక్కువ తగ్గింపుతో లభ్యమవుతుంది. బ్యాంక్ కార్డ్ ఆఫర్లతో ధరను మరింత తగ్గించవచ్చు. ఈ గూగుల్ పిక్సెల్ ఫోన్ డిజైన్, సాఫ్ట్‌వేర్‌తో అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. గూగుల్ పిక్సెల్ 9a ప్రీమియం ధర ట్యాగ్ లేకుండా ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. అమెజాన్‌లో గూగుల్ పిక్సెల్ 9a డీల్‌ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

భారత మార్కెట్లో గూగుల్ పిక్సెల్ 9ఎ ఫోన్ రూ.49,999కు లాంచ్ అయింది. కానీ, ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం అమెజాన్‌లో రూ.40,490కు లిస్ట్ అయింది. రూ.9,509 ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తుంది. ఆసక్తిగల కొనుగోలుదారులు ఇంకా తగ్గింపు ధరకే ఇంటికి తెచ్చుకోవచ్చు. ఈ-కామర్స్ బ్రాండ్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, స్కాపియా ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో సహా ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై రూ.1,500 వరకు 5శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందిస్తోంది. నెలకు రూ.1,424 నుంచి నో-కాస్ట్ ఈఎంఐ కూడా అందిస్తోంది. అలాగే, మీ పాత ఫోన్ అప్‌గ్రేడ్ చేసుకుంటే అమెజాన్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌ కూడా పొందవచ్చు. పాత ఫోన్ బ్రాండ్, మోడల్ వర్కింగ కండిషన్ బట్టి కొనుగోలుదారులు రూ.38,350 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌ పొందవచ్చు.

ఈ పిక్సెల్ ఫోన్ హుడ్ కింద గూగుల్ టెన్సర్ G4 చిప్‌తో వస్తుంది. 5100mAh బ్యాటరీతో కూడా వస్తుంది. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.3-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే కూడా అందిస్తుంది. ఇంకా, డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3తో ప్రొటెక్షన్ అందిస్తుంది. ఈ పిక్సెల్ ఫోన్ HDR కంటెంట్ కోసం 1800 నిట్స్ వరకు బ్రైట్‌నెస్ లెవల్స్ అందిస్తుంది. 2700 నిట్స్ వద్ద గరిష్టంగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. కెమెరా విషయానికి వస్తే.. పిక్సెల్ 9a బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 48MP మెయిన్ కెమెరా, 13MP అల్ట్రావైడ్ లెన్స్ ఉంటాయి. అయితే, ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 13MP కెమెరా ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories