Google Pixel 5a: జూన్ లో రాబోతున్న గూగుల్ పిక్సెల్ 5ఏ..?

Google Pixel 5a: గూగుల్ పిక్సెల్ 4ఏ కు అనుబంధంగా గూగుల్ పిక్సెల్ 5 ఏ ను త్వరలోనే ఇండియలో లాంచ్ చేయబోతున్నట్లు సమాచారం.

Venkata Chari
Published on: 16 March 2021 4:54 PM IST
Google Pixel 5a Launch in India Expected on 11th June 2021
X

గూగుల్ పిక్సెల్ 5 ఏ (ఫొటో హన్స్ ఇండియా)

Google Pixel 5a: గూగుల్ పిక్సెల్ 4ఏ ఎంతగా సక్సెస్ అయిందో తెలిసిందే. దానికి అనుబంధంగా ప్రస్తుతం గూగుల్ పిక్సెల్ 5 ఏ ను త్వరలోనే ఇండియలో లాంచ్ చేయబోతున్నట్లు సమాచారం. గూగుల్ ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. కానీ, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) వెబ్‌సైట్‌లో మోడల్ నంబర్ GRoM2 ఓ పిక్సెల్ ఫోన్ కనిపించింది. అయితే టెక్ నిపుణులు పిక్సెల్ 5ఏ అని మాట్లాడుకుంటున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ జూన్‌లో యుఎస్‌లో లాంచ్ అవుతుందని తెలుస్తోంది.

ఈమేరకు టిప్‌స్టార్ ముఖుల్ శర్మ ట్వీట్ చేశారు. బీఎస్ఐ వెబ్ సైట్ లో కనిపిస్తున్న GRoM2 మోడల్ గూగుల్ పిక్సెల్ 5ఏ అని ఆయన సూచించారు.

కాగా, గూగుల్ పిక్సెల్ 5ఏ కూడా 4ఏ లాగే ఉండనున్నట్లు సమాచారం. కొంత కాలంగా గూగుల్ ఈ ఫోన్ హార్డ్ వేర్, డిజైన్, స్పెషిఫికేషన్ పై సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే జూన్ 11న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్న ఈ ఫోన్ పూర్తి వివరాలు తెలియాలంటే గూగుల్ నుంచి అధికారిక సమాచారం రావాల్సిందే.

Venkata Chari

Venkata Chari

Next Story