Health: దగ్గు శబ్ధంతో లంగ్స్‌ వ్యాధిని గుర్తించవచ్చు.. ఏఐ టెక్నాలజీతో సాధ్యమే..!

Google introducing new AI technology that identify lung health with voice
x

 Health: దగ్గు శబ్ధంతో లంగ్స్‌ వ్యాధిని గుర్తించవచ్చు.. ఏఐ టెక్నాలజీతో సాధ్యమే..

Highlights

ఈ టెక్నాలజీ పేరు హియర్ (హెల్త్ ఎకౌస్టిక్ రిప్రజెంటేషన్స్). దగ్గు శబ్దాలను విశ్లేషించడం ద్వారా ఒక వ్యక్తికి TB లేదా క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD) వంటి తీవ్రమైన వ్యాధి ఉందో లేదో తెలుసుకోవచ్చు.

ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ వినియోగం అన్ని రంగాల్లో అనివార్యంగా మారింది. వైద్య రంగంలో కూడా ఏఐని ఉపయోగిస్తున్నారు. ఈ సరికొత్త టెక్నాలజీ ఆధారంగా ఎన్నో అధునాతన యంత్రాలు పుట్టుకొస్తున్నాయి. వైద్య రంగంలో సరికొత్త అధ్యయనాలకు తెర తీస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో సరికొత్త టెక్నాలజీని పరిశోధకులు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. దీంతో మన దగ్గు శబ్ధం ఆధారంగా ఊపిరితిత్తుల సమస్యలను గుర్తించవచ్చు.

వినడానికి వింతనాగనే ఉన్నా త్వరలోనే ఈ సరికొత్త టెక్నాలజీ నిజం కానుంది. దగ్గు శబ్దాన్ని వినడం ద్వారా ఊపిరితిత్తుల వ్యాధులను గుర్తించే సరికొత్త టెక్నాలజీని గూగుల్ అభివృద్ధి చేసింది. ఈ టెక్నాలజీ పేరు హియర్ (హెల్త్ ఎకౌస్టిక్ రిప్రజెంటేషన్స్). దగ్గు శబ్దాలను విశ్లేషించడం ద్వారా ఒక వ్యక్తికి TB లేదా క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD) వంటి తీవ్రమైన వ్యాధి ఉందో లేదో తెలుసుకోవచ్చు. వైద్యులు అందుబాటులో లేని సమయంలో ఈ టెక్నాలజీ ద్వారా ప్రాథమికంగా వ్యాధి నిర్ధారణ చేసుకోవచ్చు.

ఈ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చే ముందే.. 300 మిలియన్లకు పైగా ఆడియో క్లిప్‌లు, సుమారు 100 మిలియన్ దగ్గు శబ్దాలపై పరిశోధన చేశారు. దీని కారణంగా దగ్గు శబ్ధం ఆధారంగా ఊపిరితిత్తుల వ్యాధిని గుర్తించగలదు. త్వరలోనే ఈ టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి రానుంది. గూగుల్‌ తన సాంకేతికతను మెరుగుపరచడానికి భారతీయ ఆరోగ్య సంరక్షణ సంస్థ అయిన Salcit Technologiesతో ఒప్పందం చేసుకుంది. ఈ రెండు కలిసి సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఇందులో భాగంగానే దగ్గు శబ్దాన్ని వింటూ ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని అంచనా వేసే స్వాసా అనే టూల్‌ను సాల్‌సిట్ టెక్నాలజీస్ రూపొందించింది. ఇప్పుడు ఈ టూల్‌కు హియర్ టెక్నాలజీని జోడిస్తున్నారు, తద్వారా టిబి వంటి వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించవచ్చు. సకాలంలో చికిత్స అందిస్తే నయమయ్యే టీబీని ఈ టెక్నాలజీతో ముందుగానే గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు. వ్యాధిని ముందుగా గుర్తిస్తే చికిత్స కూడా సులభంగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories