WhatsApp: వాట్సాప్ యూజర్లకు గుడ్‌న్యూస్.. మిస్డ్ కాల్ కోసం కొత్త బటన్.. ఎలా ఉపయోగించాలో తెలుసా?

Good News for WhatsApp Users New Call Back Button for Missed Call Know how to use
x

WhatsApp: వాట్సాప్ యూజర్లకు గుడ్‌న్యూస్.. మిస్డ్ కాల్ కోసం కొత్త బటన్.. ఎలా ఉపయోగించాలో తెలుసా?

Highlights

WhatsApp Call-Back Button: వాట్సాప్ వినియోగదారులకు శుభవార్త! మిస్డ్ కాల్స్ కోసం కంపెనీ త్వరలో కొత్త కాల్-బ్యాక్ సర్వీస్‌ను ప్రారంభించబోతోంది. ఈ ఫీచర్ Windows ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులోకి తీసుకురానుంది.

WhatsApp Call-Back Button: వాట్సాప్ వినియోగదారులకు శుభవార్త! మిస్డ్ కాల్స్ కోసం కంపెనీ త్వరలో కొత్త కాల్-బ్యాక్ సర్వీస్‌ను ప్రారంభించబోతోంది. ఈ ఫీచర్ Windows ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులోకి తీసుకురానుంది. తద్వారా మీరు మీ మిస్డ్ కాల్‌లను సులభంగా ట్రేస్ చేయవచ్చు. వాటికి తిరిగి కాల్ చేయవచ్చు. ఈ కొత్త కాల్-బ్యాక్ సేవను ఉపయోగించడానికి, మీరు Microsoft స్టోర్‌ని సందర్శించడం ద్వారా WhatsApp తాజా బీటా వెర్షన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. మీరు WhatsApp వినియోగదారులు అయితే, మీరు తాజా బీటా వెర్షన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ కొత్త కాల్-బ్యాక్ సేవను ఉపయోగించి ఆనందించవచ్చు.

WhatsApp కాల్-బ్యాక్ బటన్..

WABetaInfo నివేదిక ప్రకారం, WhatsApp ఒక కొత్త కాల్ బ్యాక్ బటన్‌ను జోడించింది. అది మిస్డ్ కాల్ హెచ్చరికతో సందేశాన్ని చూపుతుంది. ఈ కొత్త బటన్‌కు కాల్ బ్యాక్ ఆప్షన్ ఉంది. దానిపై నొక్కడం ద్వారా మీరు ఆ వ్యక్తికి కాల్ చేయవచ్చు. నివేదిక ప్రకారం, కాల్ బ్యాక్ బటన్ చాట్‌లోనే కనిపిస్తుంది. కాబట్టి మీరు దాని కోసం వెతకాల్సిన అవసరం లేదు.

ఈ కొత్త కాల్ బ్యాక్ బటన్ WhatsApp వినియోగదారులకు ఉపయోగకరమైన , అనుకూలమైన ఫీచర్‌గా ఉంటుంది. ఎందుకంటే ఇది మిస్డ్ కాల్‌లను కనుగొనడంతో పాటు, వెంటనే వారికి కాల్ చేసుకోవచ్చు. ఇది వాట్సాప్ వినియోగదారులకు మెరుగైన, సౌకర్యవంతమైన అనుభవాన్ని అందించే గొప్ప అప్‌డేట్‌గా పేర్కొంటున్నారు.

ఈ వినియోగదారులకే ఈ కొత్త ఫీచర్‌..

ప్రస్తుతం ఇది ఎంపిక చేసిన బీటా వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. దీని టెస్టింగ్ ప్రస్తుతం కొనసాగుతోంది. టెస్టింగ్ పూర్తయినప్పుడు, అది క్రమంగా వినియోగదారులందరికీ అందుబాటులోకి వస్తుంది. మీరు మైక్రోసాఫ్ట్ స్టోర్‌లో ఈ అప్‌డేట్‌ను ఇంకా చూడకపోతే, మీరు కొన్ని రోజులు వేచి ఉండవలసి ఉంటుంది. తాజా అప్‌డేట్‌తో వాట్సాప్ బీటా విండోస్ వెర్షన్ 2.2323.1.0 యూజర్లకు అందుబాటులోకి వచ్చింది.

బీటా టెస్టర్ల కోసం కంపెనీ అనేక కొత్త ఫీచర్లను విడుదల చేస్తోంది. కాల్ బ్యాక్ బటన్‌తో పాటు స్క్రీన్ షేరింగ్ ఫీచర్, ఎడిట్ బటన్ ఫీచర్ కూడా ఇప్పుడు వినియోగదారులందరికీ అందుబాటులోకి వచ్చాయి. ఇంతకుముందు ఈ ఫీచర్‌లు బీటా యూజర్‌లకు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు వినియోగదారులందరికీ అందుబాటులోకి వచ్చాయి. అంటే యూజర్లకు మరిన్ని ఫీచర్లను అందించేందుకు వాట్సాప్ కసరత్తు చేస్తోంది. ఈ కొత్త ఫీచర్‌లతో, వినియోగదారులు తమ చాట్‌లను ఎడిట్ చేయడానికి, కాల్‌లు చేయడానికి, మరింత ప్రొఫెషనల్, సహజమైన రీతిలో స్క్రీన్ షేర్ చేయడానికి అనుమతి ఉంటుంది. వాట్సాప్ తన వినియోగదారులకు మరింత విశ్వసనీయత, ఉపయోగకరమైన ఫీచర్లను అందించడానికి కృషి చేస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories