Gionee Max Pro: అదిరిపోయే ఫీచర్లతో జియోని కొత్త ఫోన్!

Gionee Max Pro: జియోనీ కంపెనీ తన కొత్త స్మార్ట్ ఫోన్ జియోనీ మాక్స్ ప్రోను ఫ్లిప్‌కార్ట్‌లో రూ .6,999 ధరతో లాంచ్ చేసింది.

Venkata Chari
Published on: 2 March 2021 4:26 PM IST
Gionee Max Pro Launched in India - Know Price and Specifications
X

Gionee Max Pro (ఫోటో హన్స్ ఇండియా)

Gionee Max Pro: జియోనీ కంపెనీ తన కొత్త స్మార్ట్ ఫోన్ జియోనీ మాక్స్ ప్రోను ఇండియాలో విడుదల చేసింది. ఇది ఫ్లిప్‌కార్ట్‌లో రూ .6,999 లకే కొనుగోలు చేయవచ్చు. మార్చి 8 నుంచి జియోనీ మాక్స్ ప్రో సేల్ ప్రారంభం కానుంది. కరోనా మహమ్మారి టైంలో స్మార్ట్‌ఫోన్ వినియోగం బాగా పెరిగిందనే వాస్తవం. తక్కువ ధరలో ఉన్న స్మార్ట్ ఫోన్స్ వైపే మధ్యతరగతి ప్రజలు ఆసక్తిగా ఉండడంతోనే జియోనీ మాక్స్ ప్రో ను బడ్జెట్ ధరలోనే తయారు చేసింది. చాలా మంది వినియోగదారులు ఎక్కువగా చూసేది బ్యాటరీ మరియు లార్జ్ స్క్రీన్ తోపాటు తక్కువ ధర. ఇవన్ని జియోనీ మాక్స్ ప్రో లో ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది.

జియోనీ మాక్స్ ప్రో 6,000 mAh బ్యాటరీ, 3GB RAM తోపాటు 32GB ఇంటర్నల్ మొమోరీ కలిగి ఉంది. అలాగే ఇంటర్నల్ మొమోరీని 256 GB వరకు పెంచుకోవచ్చు. 6.52-అంగుళాల HD + డిస్ప్లేతో వస్తుంది. వెనుక భాగంలో 13 MP , 2 MP డ్యుయల్ కెమెరాలు ఉన్నాయి. అలాగే సెల్ఫీ ప్రియుల కోసం ముందు భాగంలో 8 MP కెమెరా ఉంది.


ఇక ఫోన్ బ్యాటరీని ఒకసారి చార్జ్ చేస్తే.. 60 గంటల కాల్స్, 34 రోజుల స్టాండ్‌బై, 115 గంటల పాటు పాటలు, 12 గంటల పాటు గేమ్స్, 13 గంటల పాటు వీడియోలు చూడొచ్చని కంపెనీ వెల్లడిస్తుంది. వీటితో పాటు జియోనీ మాక్స్ ప్రో ఫేస్ అన్‌లాక్, షార్ట్ కీ గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ వంటి ఇతర ఫీచర్లతో అలరించనుంది. ఆండ్రాయిడ్ 10 ఓఎస్తో తో పనిచేయనున్న ఈ ఫోన్ నలుపు, ఎరుపు, నీలం రంగులలో లభిస్తుంది.

Venkata Chari

Venkata Chari

Next Story