Vodafone Idea: ఇంట్లో కూర్చొని ఫ్యాన్సీ నెంబర్‌ పొందండి.. ఇలా అప్లై చేయండి..!

Get Vodafone Idea Fancy Number Sitting at Home Apply Like This
x

Vodafone Idea: ఇంట్లో కూర్చొని ఫ్యాన్సీ నెంబర్‌ పొందండి.. ఇలా అప్లై చేయండి..!

Highlights

Vodafone Idea: సమాజంలో వీఐసీ సంస్కృతి వేళ్లూనుకుంది.

Vodafone Idea: సమాజంలో వీఐసీ సంస్కృతి వేళ్లూనుకుంది. చాలామంది వీఐపీగా కనిపించేందుకు రకరకాల ప్రయోగాలు చేస్తారు. కొంతమంది ఖరీదైన దుస్తులు, గడియారాలు ధరిస్తారు. మరికొందరు తమ ప్రవర్తనతో వీఐపీ హుందాతనాన్ని ప్రదర్శిస్తారు. ఇంకొందరు ఫ్యాన్సీ మొబైల్ నంబర్ల ద్వారా వీఐపీలుగా మారుతారు. అయితే మీకు కూడా VIP ఫోన్ నంబర్ కావాలంటే సులువుగా దొరుకుతుంది. ఇందుకోసం ఎటువంటి ఖర్చుకూడా అవసరం లేదు. అంతేకాదు ఇది ఇంట్లో కూర్చొని చేయవచ్చు. గతంలో వీఐపీ నంబర్ల కోసం వేలంపాటలు జరిగేవి కానీ ఇప్పుడు అలా ఏమిలేదు.

వోడాఫోన్ ఐడియా (VI) వినియోగదారుల కోసం VIP నంబర్లని అందిస్తుంది. ఇందుకోసం కొన్ని ప్రాథమిక ప్రక్రియలను తెలుసుకోవాలి. ఇది తెలిసిన వారికి ఫ్యాన్సీ సిమ్ నంబర్ ఉచితంగా లభిస్తుంది. కోరుకున్న ఫోన్ నంబర్‌ను పొందడానికి వేల రూపాయలు ఖర్చు చేయవలసిన అవసరం లేదు. ముందుగా వోడాఫోన్ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి. కొత్త కనెక్షన్, ఆపై ఫ్యాన్సీ మొబైల్ నంబర్‌పై క్లిక్ చేయాలి. తర్వాత మీరు మీ పిన్ కోడ్, మొబైల్ నంబర్‌ను ఎంటర్‌ చేయాలి. తర్వాత ఉచిత ప్రీమియం మొబైల్ నంబర్‌ల జాబితా నుంచి ఒక నంబర్‌ను ఎంచుకోవాలి. ఈ ప్రక్రియ తర్వాత మొబైల్‌ నెంబర్‌కి OTP వస్తుంది. అంతే కొత్త కనెక్షన్‌తో VIP నంబర్‌ వస్తుంది.

Vodafone Ideaలో ఈ సౌకర్యం ప్రస్తుతం వోడాఫోన్-ఐడియా ఈ అవకాశాన్ని అందిస్తోంది. ఈ సంస్థ తన కస్టమర్లకు ఉచితంగా వీఐపీ నంబర్లను అందజేస్తోంది. దీని కోసం మీ నుంచి ఎటువంటి అదనపు రుసుము వసూలు చేయదు. మీరు ఇలా ఇంటి మొబైల్ నంబర్‌ను కూడా పొందవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories