Best 4K Smart TV: 4K రిజల్యూషన్.. 40W పవర్ ఫుల్ స్పీకర్లు.. తక్కువ ధరలోనే మైండ్ బ్లోయింగ్ స్మార్ట్ టీవీలు..!

Best 4K Smart TV: మీరు 43 అంగుళాల స్క్రీన్‌తో కొత్త స్మార్ట్ టీవీని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా.. మార్కెట్లో అనేక ఎంపికలు అందుబాటులో ఉన్నాయి.

Jyothi
Published on: 23 Aug 2023 4:19 PM IST
From Kodak to Westinghouse these 4 Android 4k Smart tvs Under 25000 Rupees
X

Best 4K Smart TV: 4K రిజల్యూషన్.. 40W పవర్ ఫుల్ స్పీకర్లు.. తక్కువ ధరలోనే మైండ్ బ్లోయింగ్ స్మార్ట్ టీవీలు..!

Best 4K Smart TV: మీరు 43 అంగుళాల స్క్రీన్‌తో కొత్త స్మార్ట్ టీవీని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా.. మార్కెట్లో అనేక ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. Kodak, Acer, Westinghouse, TCL వంటి బ్రాండ్‌లు సరసమైన ధరలకు శక్తివంతమైన ఫీచర్లతో కొత్త స్మార్ట్ టీవీలను నిరంతరం విడుదల చేస్తున్నాయి. 4K స్క్రీన్‌తో వచ్చే టాప్-4 స్మార్ట్ టీవీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వీటిని రూ.25000 లోపు కొనుగోలు చేయవచ్చు.

ఈ స్మార్ట్ టీవీలను అమెజాన్ ఇండియా నుంచి డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్‌లు, నో-కాస్ట్ EMIలో తీసుకోవచ్చు. ఈ స్మార్ట్ టీవీలు బ్లూటూత్ కనెక్టివిటీతో అద్భుతమైన సౌండ్ అవుట్‌పుట్, గొప్ప స్క్రీన్, రిమోట్‌ను అందిస్తున్నాయి.

1- వెస్టింగ్‌హౌస్ 43 అంగుళాల 4K అల్ట్రా HD సర్టిఫైడ్ ఆండ్రాయిడ్ LED TV: రూ.20,499ల ధరతో వెస్టింగ్‌హౌస్ WH43UD10 TV అద్భుతమైన సౌండ్ టెక్నాలజీని అందిస్తుంది. ఈ టీవీలో 40W పవర్ ఫుల్ స్పీకర్లు అందించారు. టీవీ 43-అంగుళాల LED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 4K రిజల్యూషన్, విస్తృత వీక్షణ కోణాల కోసం IPS సాంకేతికతను అందిస్తుంది. టీవీ Android 9.0 Pie ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తుంది. ఈ టీవీ బ్లూటూత్, Wi-Fi కనెక్టివిటీతో గొప్ప స్మార్ట్ టీవీ అనుభవాన్ని అందిస్తుంది.

2- కోడాక్ 43 అంగుళాల బెజెల్-లెస్ డిజైన్ సిరీస్ 4K అల్ట్రా HD స్మార్ట్ ఆండ్రాయిడ్ LED TV: రూ. 19,490ల ధరతో కొడాక్ 43 అంగుళాల 4K LED TV ఉత్తమ వీక్షణ అనుభవాన్ని అందిస్తుంది. ఈ టీవీ HDR 10 డిస్ప్లేతో వస్తుంది. దీని రిజల్యూషన్ 3840 x 2160 పిక్సెల్స్ గా ఉంది. Android ఆపరేటింగ్ సిస్టమ్‌తో కూడిన ఈ టీవీలో అనేక యాప్‌లు, కంటెంట్‌కి మద్దతు ఉంది. కొడాక్ నుంచి వచ్చిన ఈ స్మార్ట్ టీవీ సరౌండ్ సౌండ్ స్పీకర్ సిస్టమ్‌తో 40W ఆడియో అవుట్‌పుట్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్ టీవీలో అంతర్నిర్మిత వై-ఫై, బ్లూటూత్ టెక్నాలజీని అందించారు. టీవీతో పాటు వచ్చే రిమోట్‌లో అమెజాన్ ప్రైమ్, సోనీ లివ్, యూట్యూబ్ కోసం ప్రత్యేక బటన్లు ఉన్నాయి.

3- TCL 43 అంగుళాల 4K అల్ట్రా HD సర్టిఫైడ్ ఆండ్రాయిడ్ స్మార్ట్ LED TV: రూ. 21,990ల ధరలో TCL 43P615 43-అంగుళాల LED డిస్‌ప్లేతో కూడిన 4K Android TVని తీసుకొచ్చింది. స్క్రీన్ 3840 x 2160 పిక్సెల్స్ రిజల్యూషన్‌ను అందిస్తుంది. డిస్ప్లే నిష్పత్తి 16:9లుగా ఉంది. ఈ టీవీ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తుంది. నెట్‌ఫ్లిక్స్, జీ5, ప్రైమ్ వీడియో వంటి యాప్‌లకు యాక్సెస్‌ను కలిగి ఉంది. డాల్బీ ఆడియో టెక్నాలజీతో టీవీలో సరౌండ్ సౌండ్ సపోర్ట్ అందుబాటులో ఉంది. టీవీతో పాటు వచ్చే రిమోట్‌లో స్ట్రీమింగ్ సేవల కోసం ప్రత్యేక బటన్‌లు ఉన్నాయి. టీవీ Wi-Fi కనెక్టివిటీకి మద్దతు ఇస్తుంది.

4- Acer 43 అంగుళాల అధునాతన I సిరీస్ 4K అల్ట్రా HD స్మార్ట్ LED Google TV: రూ.24,999ల ధరతో Acer AR43GR2851UDFL అనేది Google TV ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందించే 43 అంగుళాల స్క్రీన్‌తో కూడిన స్మార్ట్ టీవీ. ఈ స్మార్ట్ టీవీలో 4కె అల్ట్రా హెచ్‌డీ డిస్‌ప్లే ఉంది. Dolby Vision, Atmus Technology, 2GB RAM, 16GB ఇంబిల్ట్ స్టోరేజ్ వంటి ఫీచర్లు ఈ టీవీలో అందించారు. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో వంటి జనాదరణ పొందిన అప్లికేషన్‌లకు ఈ టీవీలో మద్దతు ఉంది. ఈ టీవీలో 30W స్పీకర్లు అందించారు.

Jyothi

Jyothi

Next Story