Smartphone: మీ స్మార్ట్ ఫోన్ మరీ స్లోగా మారిందా.? ఇలా చేయండి..!


Smartphone: మీ స్మార్ట్ ఫోన్ మరీ స్లోగా మారిందా.? ఇలా చేయండి..!
Smartphone: ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ వాడని వారిని భూతద్దం వేసి మరీ వెతికినా కనిపించని పరిస్థితి ఉంది. ఒక్క ఇంట్లో ఏకంగా 3, 4 స్మార్ట్ ఫోన్‌లు ఉండే పరిస్థితి ఉంది.
Smartphone: ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ వాడని వారిని భూతద్దం వేసి మరీ వెతికినా కనిపించని పరిస్థితి ఉంది. ఒక్క ఇంట్లో ఏకంగా 3, 4 స్మార్ట్ ఫోన్‌లు ఉండే పరిస్థితి ఉంది. ప్రతీ అవసరానికి ఒక యాప్ అందుబాటులోకి రావడంతో స్మార్ట్ ఫోన్ వినియోగం అనివార్యంగా మారింది. అయితే స్మార్ట్ ఫోన్ మొదట్లో వేగంగా పనిచేసినా, క్రమేణా స్లోగా మారుతుంది. మనలో చాలా మంది ఈ సమస్యను ఏదో ఒకసారి ఎదుర్కొనే ఉంటారు. ఇంతకీ స్మార్ట్ ఫోన్ ఎందుకు స్లో అవుతుంది.? మళ్లీ స్పీడ్‌గా మారడానికి ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
* సాధారణంగా మొబైల్ ఫోన్ స్లోగా మారడానికి ప్రధాన కారణాల్లో యాప్స్ ఎక్కువగా ఉండడం ఒక కారణం. అందుకే వీలైనంత వరకు ఫోన్‌లో అవసరం లేని యాప్స్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేయడం మంచిది. ఎప్పుడో ఒకసారి ఉపయోగడే యాప్స్ తొలగించి, మళ్లీ అవసరమైనప్పుడు ఇన్‌స్టాల్ చేసుకోవడం బెటర్. దీనివల్ల మీ ఫోన్ వేగం పెరుగుతుంది.
* ఇక ఫోన్ నెమ్మదిస్తుందంటే లేటెస్ట్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ లేకపోవడమే కారణమని భావించాలి. మీ ఫోన్‌కు అందుబాటులో ఉన్న లేటెస్ట్ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేసుకోవాలి. మీ ఫోన్ సపోర్ట్ చేసే లేటెస్ట్ ఆండ్రాయిడ్ వెర్షన్ ఫోన్‌లో ఉందే లేదో చూసుకొని అప్‌డేట్ చేసుకుంటే సరిపోతుంది. మీ ఫోన్ వేగం మళ్లీ పెరుగుతుంది.
* ఫోన్‌లో క్యాచీ మెమోరీ పెరిగిపోయినా ఫోన్ నెమ్మదిస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు క్యాచీ మెమోరీని డిలీట్ చేస్తుండాలి. ఇందుకోసం సెట్టింగ్స్‌లోకి వెళ్లి మెమోరీ ఆప్షన్‌లో ఉండే క్యాచీ మెమోరీని సెలక్ట్ చేసుకొని డిలీట్ చేస్తే సరిపోతుంది. సాధారణంగా క్యాచీ మెమోరీ పెరగడం వల్ల ఫోన్‌లో యాప్స్ ఓపెన్ కాకపోవడం, ఒక్కసారిగా ఫోన్ రీస్టార్ట్ కావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
* ఇక ఎన్నిరకాల ప్రయత్నాలు చేసినా మీ ఫోన్ వేగం పెరగకపోతే ఒకసారి ఫ్యాక్టరీ రీసెట్ చేయడం బెటర్. అయితే ఫ్యాక్టరీ రీసెట్ చేసే కంటే ముందు కచ్చితంగా మీ ఫోన్ మెమోరీని బ్యాకప్ చేసుకోవాలి. కాంటాక్ట్‌లతో పాటు ఫొటోలను బ్యాకప్ చేసుకోవడం మంచిది. ఇందుకోసం సెట్టింగ్స్‌లోకి బ్యాకప్ అండ్ రీసెట్‌పై క్లిక్ చేయాలి. అనంతరం రీసెట్‌లోకి వెళ్లి ఎరేస్ ఎవ్రీథింగ్‌పై క్లిక్ చేస్తే సరిపోతుంది. మీ ఫోన్ మళ్లీ వేగంగా మారుతుంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



