Motorola G85 5G Price Cut: చాలా మంచి ఆఫర్.. మోటరోలా 5జీ స్మార్ట్‌ఫోన్‌పై రూ.5000 డిస్కౌంట్.. మిస్ చేయకండి..!

Motorola G85 5G Price Cut: చాలా మంచి ఆఫర్.. మోటరోలా 5జీ స్మార్ట్‌ఫోన్‌పై రూ.5000 డిస్కౌంట్.. మిస్ చేయకండి..!
x

Motorola G85 5G Price Cut: చాలా మంచి ఆఫర్.. మోటరోలా 5జీ స్మార్ట్‌ఫోన్‌పై రూ.5000 డిస్కౌంట్.. మిస్ చేయకండి..!

Highlights

ఫ్లిప్‌కార్ట్ సాసా లేలే సేల్‌లో స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

Motorola G85 5G Price Cut: ఫ్లిప్‌కార్ట్ సాసా లేలే సేల్‌లో స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్‌లో శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్ Motorola G85 5G భారీ తగ్గింపుతో లభిస్తుంది. ఈ ఫోన్‌ను రూ.5000 భారీ తగ్గింపుతో కొనుగోలు చేయచ్చు.బడ్జెట్‌లో గొప్ప కెమెరా, శక్తివంతమైన బ్యాటరీ, కొత్త ఫీచర్లతో కూడిన ఫోన్‌ను కొనాలని చూస్తున్నట్లయితే, ఈ డీల్స్ మీకు సరైనవి కావచ్చు. ఇది లిమిటెడ్ ఆఫర్ మాత్రమే. ఈ ఫోన్ ఫీచర్స్. ధర, స్పెసిఫికేషన్లు, ఆఫర్లు తదితర వివరాలు తెలుసుకుందాం.

Motorola G85 5G Offers

ఫ్లిప్‌కార్ట్ ఈ స్పెషల్ సేల్‌లో మోటరోలా G85 8జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ 23 శాతం తగ్గింపుతో రూ. 15,999 కు కొనుగోలుకు అందుబాటులో ఉంది. అయితే దీని ప్రారంభ ధర రూ. 20,999. దీనితో పాటు, ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి ఫోన్ కొనుగోలు చేస్తే అదనంగా 5 శాతం క్యాష్‌బ్యాక్ కూడా పొందచ్చు. అలాగే, ఫోన్‌లో EMI ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.

Motorola G85 5G Features

ఈ ఫోన్ 6.67 అంగుళాల P-OLED కర్వ్డ్ డిస్‌ప్లేతో విడుదలైంది. ఇది 1080x2400 px (FHD+) రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, బెజెల్-లెస్ పంచ్ హోల్‌తో జత చేసి ఉంటుంది. దీనికి గొరిల్లా గ్లాస్ 5 ప్రొటక్షన్ అందించారు. ఫోటోగ్రఫీ కోసం, ఫోన్‌లో డ్యూయల్ కెమెరా సిస్టమ్ ఉంది, ఇందులో 10x డిజిటల్ జూమ్‌తో 50 MP వైడ్ యాంగిల్ ప్రైమరీ కెమెరా, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, LED ఫ్లాష్ ఉన్నాయి. అదే సమయంలో, సెల్ఫీ కోసం 32 MP ఫ్రంట్ షూటర్ అందుబాటులో ఉంది. పవర్ విషయానికొస్తే, ఫోన్‌లో 5000 mAh బ్యాటరీ ఉంది. బ్యాటరీని ఛార్జ్ చేయడానికి 33W టర్బో పవర్ ఛార్జింగ్ సపోర్ట్ అందించారు. ఇదిUSB టైప్-C పోర్ట్‌తో వస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories