OnePlus 13 Offer: వన్‌ప్లస్ నుంచి అదిరిపోయే ఆఫర్లు.. మరీ ఇంత తక్కువ ధరనా..?

OnePlus 13 Offer
x

OnePlus 13 Offer: వన్‌ప్లస్ నుంచి అదిరిపోయే ఆఫర్లు.. మరీ ఇంత తక్కువ ధరనా..?

Highlights

OnePlus 13 Offer: కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? మీకోసం వన్‌ప్లస్ 13 ఫోన్ అతి తక్కువ ధరకే అందుబాటులో ఉంది. ఈ వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ కొనేందుకు ఇదే బెస్ట్ టైమ్.

OnePlus 13 Offer: కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? మీకోసం వన్‌ప్లస్ 13 ఫోన్ అతి తక్కువ ధరకే అందుబాటులో ఉంది. ఈ వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ కొనేందుకు ఇదే బెస్ట్ టైమ్. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌ వన్‌ప్లస్ 13 అసలు ధరపై ఏకంగా రూ. 9,700 డిస్కౌంట్ ఇస్తుంది. ముఖ్యంగా కొత్త ఫోన్ కొనాలని ఎదురుచూస్తున్న వారికి ఈ ఆఫర్ చాలా బాగుంటుంది. అయితే, ఇది లిమిటెడ్ ఆఫర్ మాత్రమే. ఈ అద్భుతమైన ఆఫర్ అసలు మిస్ చేసుకోవద్దు. ఇంతకీ, ఈ బిగ్ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం.

OnePlus 13 Discount Offer

వన్‌ప్లస్13ను కంపెనీ దేశంలో రూ. 69,999 ప్రారంభ ధరకు విడుదల చేసింది. వన్‌ప్లస్ అధికారిక వెబ్‌సైట్‌లో కూడా, ఈ ఫోన్ ధర రూ.69,999. కానీ ఫ్లాగ్‌షిప్ మొబైల్ ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ.64,299. అంటే ఫోన్‌పై రూ. 5,700 వరకు ఫ్లాట్ డిస్కౌంట్ ఇస్తుంది. ఇది మాత్రమే కాకుండా, కంపెనీ ఒక ప్రత్యేక బ్యాంక్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది.

అలానే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎమ్ఐ లావాదేవీలపై రూ. 4,000 వరకు అదనపు తగ్గింపు లభిస్తుంది. ఇది ధరను మరింత తగ్గిస్తుంది.ఈ రెండు ఆఫర్లతో ఫోన్ ధరను రూ. 9,700 వరకు తగ్గించవచ్చు. ఇది కాకుండా, మీరు మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకుని మరిన్ని డిస్కౌంట్‌లను పొందచ్చు.

OnePlus 13 Specifications

వన్‌ప్లస్ 13 స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే దీనిలో HDR10 + సపోర్ట్‌తో 6.82-అంగుళాల LTPO 3K డిస్‌ప్లే ఉంటుంది. ఈ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. ఈ స్మార్ట్‌పోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌‌పై రన్ అవుతుంది. అలానే మొబైల్‌లో 24జీబీ ర్యామ్, 1టీబీ UFS 4.0 స్టోరేజ్‌ ఉంటుంది.

ఇది కాకుండా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో పెద్ద 6,000 mAh బ్యాటరీని అందించారు. అలానే ఫోటోగ్రఫీ కోసం ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50MP ప్రైమరీ షూటర్, 3x ఆప్టికల్ జూమ్‌తో 50MP టెలిఫోటో లెన్స్, 50MP అల్ట్రా-వైడ్ సెన్సార్ ఉన్నాయి. ఈ ఫోన్‌లో సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 32MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories