Redmi Note 13 Pro Plus Price: పెద్ద ఆఫరే ఇది.. రెడ్‌మి నోట్ 13 ప్రో ప్లస్‌పై రూ.10 వేల డిస్కౌంట్..!

Redmi Note 13 Pro Plus Price: పెద్ద ఆఫరే ఇది.. రెడ్‌మి నోట్ 13 ప్రో ప్లస్‌పై రూ.10 వేల డిస్కౌంట్..!
x
Highlights

Redmi Note 13 Pro Plus Price: ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుతం ప్రముఖ మిడ్-రేంజ్ రెడ్‌మి నోట్ 13 ప్రో ప్లస్‌పై పెద్ద తగ్గింపును అందిస్తోంది.

Redmi Note 13 Pro Plus Price: ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుతం ప్రముఖ మిడ్-రేంజ్ రెడ్‌మి నోట్ 13 ప్రో ప్లస్‌పై పెద్ద తగ్గింపును అందిస్తోంది. క్యాష్ డిస్కౌంట్స్, బ్యాంక్ ఆఫర్‌లతో ఫోన్ ధర గణనీయంగా తగ్గుతుంది. ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్‌తో మీరు ఫోన్‌పై రూ. 10,368 వరకు ఆదా చేయచ్చు. అయితే బ్యాంక్ ఆఫర్‌తో ఫోన్ ధర మరింత తగ్గుతుంది.

కంపెనీ ఈ ఫోన్‌ని దాదాపు రూ. 33,000 ధరతో విడుదల చేసింది. అయితే ఇప్పుడు వినియోగదారులు ఈ ఫోన్‌ని ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 25,000 కంటే తక్కువకు కొనుగోలు చేయచ్చు. కాబట్టి, మీరు రూ. 25,000 లోపు మంచి లుక్స్, శక్తివంతమైన హార్డ్‌వేర్‌తో కొత్త మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ను కొనాలని చూస్తుంటే ఫ్లిప్‌కార్ట్‌లో రెడ్‌మి నోట్ 13 ప్రో ప్లస్ డీల్‌ను మిస్ చేయకండి.

Redmi Note 13 Pro Plus Discount Offers

రెడ్‌మి నోట్ 13 ప్రో ప్లస్ ధర ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 10,368 భారీ తగ్గింపు లభిస్తుంది. దీంతో రూ.22,631కి మీ సొంతం చేసుకోవచ్చు. PNB వంటి ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌లపై రూ. 1,000 వరకు బ్యాంక్ డిస్కౌంట్ ఇస్తున్నారు. మీరు ఫోన్‌ను నెలకు రూ. 1,402 చెల్లించి కూడా దక్కించుకోవచ్చు.

రెడ్‌మి నోట్ 13 ప్రో ప్లస్‌లో 6.67-అంగుళాల కర్వ్‌డ్ ఆమోలెడ్ 1.5కె ప్యానెల్, 120Hz రిఫ్రెష్ రేట్, 1,800 నిట్స్ పీక్ బ్రైట్నె‌స్‌కు సపోర్ట్ చేస్తుంది. స్క్రీన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటక్షన్‌తో వస్తుంది. HDR10+కి సపోర్ట్ ఇస్తుంది. అలానే మీడియాటెక్ 7200 అల్ట్రా చిప్‌తో 16GB వరకు ర్యామ్, 512జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది.

ఇది మాత్రమే కాదు, ఈ ఫోన్ 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000 mAh బ్యాటరీ కూడా ఉంది. కెమెరా విషయానికి వస్తే.. OISతో 200MP ప్రైమరీ కెమెరాతో పాటు 8MP అల్ట్రా-వైడ్ సెన్సార్, 2MP మాక్రో సెన్సార్‌తో వస్తుంది. ఫోన్ ముందు భాగంలో 16MP ఫ్రంట్ కెమెరా ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories