Moto G45 5G Price Drop: ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్.. కేవలం రూ. 9,999కే ఆర్డర్ చేయచ్చు..!

Flipkart is Offering 20 Percent Discount on Moto 5G Phone
x

Moto G45 5G Price Drop: ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్.. కేవలం రూ. 9,999కే ఆర్డర్ చేయచ్చు..!

Highlights

Moto G45 5G Price Drop: మోటో మొబైల్ ప్రియులకు ఫ్లిప్‌కార్ట్ మంచి ఆఫర్‌ను అందిస్తోంది.

Moto G45 5G Price Drop: మోటో మొబైల్ ప్రియులకు ఫ్లిప్‌కార్ట్ మంచి ఆఫర్‌ను అందిస్తోంది. Moto 5G ఫోన్‌ను 20శాతం తగ్గింపుతో విక్రయిస్తోంది. రిపబ్లిక్ డే బొనాంజా సేల్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో జరుగుతోంది. ఈ స్పెషల్ సేల్‌లో అనేక బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్లను తక్కువ ధరకే మీ సొంతం చేసుకోవచ్చు. సేల్ జనవరి 26 వరకు లైవ్ అవుతుంది. ఇప్పుడు Moto G35 5G తగ్గింపు ధరకు లభిస్తుంది.

Moto G45 5G మొబైల్ రెండు స్టోరేజ్ ఆప్షన్లలో అమ్ముడవుతోంది. ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఇది స్నాప్‌డ్రాగన్ జెన్ 3 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. ఈ ఫోన్‌లో 6.5 అంగుళాల డిస్‌ప్లే ఉంది. అలానే 128GB స్టోరేజ్, 5000mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉన్నాయి. ప్రస్తుతం Moto G45 5G ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో లాంచ్ ధర కంటే తక్కువ ధరకు కొనచ్చు. దీని గురించి మరింత వివరాలు తెలుసుకుందాం.

Moto G45 5G Offers

మోటో G45 5G ఫోన్ 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999. ప్రస్తుతం దీనిని ఫ్లిప్‌కార్ట్‌ రూ.11,999కి సేల్ చేస్తోంది. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డుల ద్వారా EMI పేమెంట్ చేస్తే రూ. 1000 అదనపు డిస్కౌంట్ ఇస్తున్నారు. అదనంగా బ్యాంక్ ఆఫర్‌లో భాగంగా 5 శాతం క్యాష్‌బ్యాక్ అందుబాటులో ఉంది. అప్పుడు ఈ ఫోన్‌ను కేవలం రూ. 10,999కే బుక్ చేయచ్చు.

మోటో G45 5G ఫోన్ 4GB RAM + 128 GB స్టోరేజ్ వేరియంట్‌పై 20శాతం డిస్కౌంట్ అందిస్తున్నారు. ఈ ఫోన్‌ను డిస్కౌంట్‌తో కేవలం రూ. 9,999కే దక్కించుకోవచ్చు. ఈ ఫోన్ మూడు కలర్ వేరియంట్‌లలో ఉంది. అందులో వివా మెజెంటా, బ్రిలియంట్ బ్లూ, బ్రిలియంట్ గ్రీన్ కలర్స్ ఉన్నాయి.

Moto G45 5G Features

ఈ స్మార్ట్‌ఫోన్ 6.5-అంగుళాల HD ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 1600 x 720 పిక్సెల్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 500 నిట్స్ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ డిస్‌ప్లేకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటక్షన్ ఉంది. ఈ మొబైల్‌లో స్నాప్‌డ్రాగన్ 6s Gen 3 ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఉంది. ఈ మోటో ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్‌పై రన్ అవుతుంది.

మోటో G45 5G మొబైల్‌లో 50-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2-మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్‌లో సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 4GB, 8GB RAM, 128GB స్టోరేజ్ ఉన్నాయి. మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజ్‌ని 1TB వరకు పెంచుకోవచ్చు. ఫోన్ 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ బ్యాటరీ18W ఛార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది. ఈ మోటో స్మార్ట్‌ఫోన్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. కనెక్టివిటీ ఆప్షన్స్‌లో డ్యూయల్ సిమ్ 5G, బ్లూటూత్ 5.2, Wi-Fi, మరెన్నో ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories