Flipkart Black Friday Sale 2024: 'బ్లాక్‌ ఫ్రైడే సేల్‌'.. ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్స్!

Flipkart Black Friday Sale 2024: బ్లాక్ ఫ్రైడే సేల్ ఈ ఏడాది నవంబర్ 29న వస్తుంది. భారత్‌లో బ్లాక్ ఫ్రైడే సేల్ సందడి మొదలైంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Updated on: 22 Nov 2024 11:01 PM IST
Flipkart Black Friday Sale 2024
X

Flipkart Black Friday Sale 2024

Flipkart Black Friday Sale 2024: 'బ్లాక్‌ ఫ్రైడే సేల్‌' అమెరికాలో ప్రారంభమైంది. నవంబర్ చివరి శుక్రవారం నాడు జరుపుకునే 'థాంక్స్ గివింగ్ డే'ను బ్లాక్‌ ఫ్రైడే అంటారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో క్రిస్మస్ కోసం షాపింగ్ ప్రారంభమవుతుంది. అందుకే నవంబర్ చివరి శుక్రవారం రోజు షాపింగ్ కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. బ్లాక్ ఫ్రైడే రోజున షాపింగ్ చేసే కస్టమర్లకు ప్రత్యేక తగ్గింపులు, భారీ ఆఫర్‌లు ఉంటాయి. యూస్‌లో ప్రారంభమైన ఈ సేల్.. ప్రస్తుతం భారత్‌లో ఓ సెన్సేషన్‌గా మారింది.

బ్లాక్ ఫ్రైడే సేల్ ఈ ఏడాది నవంబర్ 29న వస్తుంది. భారత్‌లో బ్లాక్ ఫ్రైడే సేల్ సందడి మొదలైంది. ఈ నేపథ్యంలో ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ కంపెనీలు వినియోగదారులకు ప్రత్యేక తగ్గింపులు, ఆఫర్‌లను ప్రకటిస్తున్నాయి. ప్రముఖ ఇ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ కూడా బ్లాక్‌ ఫ్రైడే సేల్‌ ప్రకటించింది. నవంబర్ 24 నుంచి 29 వరకు ఈ సేల్ కొనసాగనుంది. ఇందుకు సబంధించిన ఓ బ్యానర్‌ను ఫ్లిప్‌కార్ట్‌ పోస్ట్ చేసింది. ఆరు రోజుల పాటు సాగే ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌నులతో పాటు స్మార్ట్ టీవీలు, స్మార్ట్‌ వాచ్‌లు, ల్యాప్‌టాప్‌లు, దుస్తులు, గృహోపకరణాలపై భారీగా ఆఫర్లు ప్రకటించింది.

సేల్‌లో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్‌ బ్యాంక్‌ల క్రెడిట్‌, డెబిట్‌ కార్డులపై 10 శాతం డిస్కౌంట్‌ ఉంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్‌ బ్యాంక్‌పై 5 శాతం క్యాష్ బ్యాక్ లభించనుంది. ప్లిప్‌కార్ట్‌ పే లేటర్‌ ద్వారా లక్ష వరకు రుణ సదుపాయం కూడా ఉంది. సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్లపై భారీ ఎత్తున డిస్కౌంట్లు లభించనున్నాయి. రియల్ మీ, మోటో, వివో, నథింగ్ వంటి ఫోన్లపై డిస్కౌంట్లు ఇవ్వనున్నారు. అయితే ఏ ఫోన్‌పై ఎంత డిస్కౌంట్‌ లభించేదీ ప్లిప్‌కార్ట్‌ ఇంకా వెల్లడించలేదు. ఫ్లిప్‌కార్ట్‌ త్వరలో అన్ని డీటైల్స్ రివీల్ చేయనుంది. ఎలక్ట్రానిక్స్ వస్తువులపై 70-80 పెర్సెంట్ ఆఫర్స్ ఉండనున్నాయి.

శాంసంగ్, అమెజాన్, టాటా క్లిక్, సోనీ వంటి వివిధ బ్రాండ్‌లు భారతదేశంలోని తన వినియోగదారుల కోసం బ్లాక్ ఫ్రైడే సేల్ ఆఫర్‌లను ప్రకటించాయి. అజియో, మింత్రా లాంటివి ఇంకా విక్రయ తేదీలను త్వరలో వెల్లడించనున్నాయి. అమెజాన్లో నవంబర్ 21 నుంచి 29 వరకు బ్లాక్ ఫ్రైడే సేల్ నిర్వహించనుంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story