Facebook: బ్రాండ్‌ నేమ్‌ను మార్చుకోనున్న ఫేస్‌బుక్‌

* ఫేస్‌బుక్ కొత్త పేరు మెటాగా వెల్లడి * వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌కు నిర్వహణ సంస్థ

Shilpa
Updated on: 29 Oct 2021 9:23 AM IST
FaceBook CEO Mark Zuckerberg Reveals that He is Changing his Brand Name to Meta
X

 బ్రాండ్‌ నేమ్‌ను మార్చుకోనున్న ఫేస్‌బుక్‌(ఫైల్ ఫోటో)

FaceBook: ఫేస్‌బుక్ తన పేరును మార్చుకుంది. ఇకపై తన బ్రాండ్‌ నేమ్‌ను మెటాగా చేంజ్‌ చేస్తున్నట్లు కంపెనీ సీఈవో మార్క్‌ జుకెర్‌బర్గ్‌ వెల్లడించారు. వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సోషల్‌ మీడియా వేదికలకు ఫేస్‌బుక్ నిర్వహణ సంస్థగా ఉంది. ప్రస్తుత బ్రాండ్‌నేమ్‌ కంపెనీ కార్యకలాపాలన్నింటినీ ప్రతిబింబించేలా లేనందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. డిసెంబరు 1 నుంచి అమెరికన్‌ స్టాక్‌ ఎక్స్‌చేంజ్‌లో ఫేస్‌బుక్‌ షేరు ఎంవీఆర్‌ఎస్‌ పేరుతో ట్రేడవనుంది.

Shilpa

Shilpa

Next Story