Inverter Tips: ఇన్‌వర్టర్‌ విషయంలో ఈ తప్పులు చేయవద్దు.. పేలిపోయే ప్రమాదం..!

Dont Make These Mistakes in Inverter There is Danger of Explosion
x

Inverter Tips: ఇన్‌వర్టర్‌ విషయంలో ఈ తప్పులు చేయవద్దు.. పేలిపోయే ప్రమాదం..!

Highlights

Inverter Tips: ఎండాకాలం వచ్చేసింది. కరెంట్‌ కోతల సమస్య మొదలైంది. ప్రతి సంవత్సరం జరిగే పాత కథే ఇది.

Inverter Tips: ఎండాకాలం వచ్చేసింది. కరెంట్‌ కోతల సమస్య మొదలైంది. ప్రతి సంవత్సరం జరిగే పాత కథే ఇది. అందుకే చాలామంది ప్రత్యామ్నాయంగా ఇన్‌వర్టర్‌లని కొనుగోలు చేస్తున్నారు. ఇది చాలా సమయాలలో మిమ్మల్ని వేడి నుంచి కాపాడుతుంది. అయితే స్వల్ప నిర్లక్ష్యం వల్ల ఇన్వర్టర్‌ పేలిపోయే ప్రమాదం ఉంది. అంతేకాదు ఇది పెను ప్రమాదంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఇన్‌వర్టర్‌ జాగ్రత్తల గురించి ఈరోజు తెలుసుకుందాం.

ఇంట్లో ఇన్‌వర్టర్‌ను ఇన్‌స్టాల్ చేసి ఉన్నా లేదా ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్నా కొన్ని విషయాలు కచ్చితంగా గుర్తుంచుకోవాలి. మొదటిది ఇన్వర్టర్ సెట్‌ను పొందినప్పుడు దానిని ఎల్లప్పుడూ ఓపెన్ ఎయిర్‌లో ఉండే విధంగా చూసుకోవాలి. లేదా సరైన వెంటిలేషన్ అందుబాటులో ఉన్న ప్రదేశంలో ఉంచాలి. ఇన్వర్టర్‌లో బ్యాటరీ ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి దీని కారణంగా అది పేలిపోయే ప్రమాదం ఉంది.

ఇన్వర్టర్‌లోని వైరింగ్‌ను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలి. ఎల్లప్పుడూ ఉత్తమ నాణ్యత గల వైర్లను మెయింటెన్‌ చేయాలి. తద్వారా వైరింగ్‌లో స్పార్కింగ్ ప్రమాదం ఉండదు. నాణ్యత లేని వైర్‌ను ఉపయోగిస్తే మొత్తం ఇంటి వైర్లలో షాట్ సర్క్యూట్ ప్రమాదం పొంచి ఉంటుంది. ఇన్వర్టర్ పని చేయడానికి అందులో సరైన మొత్తంలో నీరు ఉండటం అవసరం. అందుకే దానిని ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ ఉండాలి. తక్కువ నీరు ఉంటే ఇన్వర్టర్‌పై ఒత్తిడి పెరుగుతుంది. దీని కారణంగా వేడి ఉత్పత్తి అయి అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉందని గుర్తుంచుకోండి.

Show Full Article
Print Article
Next Story
More Stories