Trump YouTube Channel: ట్రంప్ యూట్యూబ్ ఛానల్ ఫై నిషేధం

Trump YouTube Channel: హింసను ప్రేరేపించే అవకాశం ఉన్నందున ట్రంప్ ఛానల్ ను నిలిపివేస్తున్నామని యూట్యూబ్ సీఈఓ అన్నారు.

Venkata Chari
Published on: 5 March 2021 2:58 PM IST
Donald Trump Youtube Channel Suspended
X

ఇమేజ్ సోర్స్: ది హ్యాండ్ ఇండియా


Trump YouTube Channel: ఆన్‌లైన్ లో వీడియో సేవలను ఉపయోగించుకుని మరింత హింసను ప్రేరేపించే అవకాశం ఉన్నందున అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యూట్యూబ్ ఛానల్ ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని యూట్యూబ్ సీఈఓ సుసాన్ వోజ్కికి అన్నారు.

"హింసాత్మక దాడులు జరిగే అవకాశం ఉందని కాపిటల్ పోలీసులు ఇచ్చిన హెచ్చరికల నేపథ్యంలో... ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని" అట్లాంటిక్ కౌన్సిల్ నిర్వహించిన ఇంటర్య్యూలో వోజ్కికి చెప్పారు. మరలా ఈ ఛానల్ ను పునరుద్ధరించేందుకు యూట్యూబ్ కంటెంట్ మోడరేషన్ నిబంధనలకు లోబడి ఉండాలని పేర్కొన్నారు.

ఈ ఛానల్ లో హింసాత్మక, అభ్యంతరకర వీడియోలను యూట్యూబ్ అనుమతించినందుకు అనేక విమర్శలు వచ్చాయన్నారు. గత ఏడాది అమెరికా ఎన్నికల ఫలితాల గురించి ఛానల్ లో తప్పుడు సమాచారం ప్రచారం చేశారని అన్నారు.

అలాగే కంటెంట్ మోడరేషన్‌ నిబంధనలను ఉల్లంఘించే కొంతమంది సృష్టికర్తలపై చాలా కఠినంగా వ్యవహరించామన్నారు. గత త్రైమాసికంలో, యూట్యూబ్ విధానాలను ఉల్లంఘించిన 9 మిలియన్లకు పైగా వీడియోలను యూట్యూబ్ నుంచి తొలగించినట్లు తెలిపారు.

Venkata Chari

Venkata Chari

Next Story