మీ స్మార్ట్‌ఫోన్‌లో ఇంటర్‌నెట్‌ త్వరగా అయిపోతుందా.. ఈ చిట్కాలు పాటించి సేవ్‌ చేసుకోండి..!

Does the Internet on Your Smartphone End Quickly Follow These Tips and Save
x

మీ స్మార్ట్‌ఫోన్‌లో ఇంటర్‌నెట్‌ త్వరగా అయిపోతుందా.. ఈ చిట్కాలు పాటించి సేవ్‌ చేసుకోండి..!

Highlights

Data Save Tips: ప్రస్తుతం ఇంటర్నెట్ ప్రతి ఒక్కరి జీవితాన్ని చాలా సులభతరం చేసింది.

Data Save Tips: ప్రస్తుతం ఇంటర్నెట్ ప్రతి ఒక్కరి జీవితాన్ని చాలా సులభతరం చేసింది. GMail, WhatsApp, YouTube నుంచి UPI లావాదేవీలు, ఇతర పనులు మొత్తం స్మార్ట్‌ఫోన్‌ ద్వారా జరుగుతున్నాయి. OTT ప్లాట్‌ఫారమ్‌లో సిరీస్, సినిమాలు, వినోదం కోసం ఫోన్‌లో ఇంటర్నెట్ ఉండటం అవసరం. అయితే ఈ పనులన్నింటికీ డేటా అధిక వేగంతో ముగుస్తుంది. ఈ పరిస్థితిలో డేటా ప్యాక్‌లు ఖరీదైనవిగా మారుతున్నాయి. మొబైల్ డేటా వినియోగం కూడా పెరుగుతోంది. ఈ సమస్యను అధిగమించడానికి డేటాను సేవ్ చిట్కాలని తెలుసుకుందాం.

wifi మోడ్‌లో యాప్‌లు

డేటాను సేవ్ చేయడానికి ముందుగా మొబైల్ డేటా మోడ్ నుంచి Google Playstore నుంచి అప్‌డేట్ చేసిన అన్ని యాప్‌ల అప్‌డేట్‌ను తీసివేసి WiFi మోడ్‌లో ఉంచండి. చాలా మంది వినియోగదారులకు తమ ఫోన్ డేటా ఏ యాప్‌లో ఖర్చు అవుతుందో తెలియదు. ఈ యాప్‌లను WiFi మోడ్‌లో ఉంచితే ఇది మొబైల్ డేటాను కొంత వరకు ఆదా చేస్తుంది.

డేటా లిమిట్‌ సెట్

మీ మొబైల్‌లో డేటా పరిమితిని సెట్ చేసుకోవడం ఉత్తమం. ప్రతి మొబైల్ లో ఈ ఆప్షన్ ఉంటుంది. డేటా లిమిట్ సెట్ చేసుకోవాలంటే ముందుగా స్మార్ట్ ఫోన్ సెట్టింగ్స్ లోకి వెళ్లండి. తర్వాత డేటా లిమిట్‌, బిల్లింగ్ సైకిల్ ఎంపికపై క్లిక్ చేయండి. తర్వాత స్మార్ట్‌ఫోన్‌లో డేటా పరిమితిని సెట్ చేసుకోవచ్చు. మీరు 1GB డేటా పరిమితిని సెట్ చేస్తే 1GB డేటా ముగిసిన తర్వాత ఇంటర్నెట్ ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది.

డేటా సేవర్ మోడ్‌

మీ స్మార్ట్‌ఫోన్‌లో డేటా సేవర్ మోడ్‌ను ప్రారంభించండి. ఈ ఆప్షన్ మీ మొబైల్‌లో ఉంటుంది. ఈ మోడ్‌ను ప్రారంభించిన తర్వాత మీరు మీ డేటాను చాలా వరకు సేవ్ చేయవచ్చు. ఇది కాకుండా తక్కువగా ఉపయోగించే యాప్‌లను తొలగించండి లేదా అన్‌ఇన్‌స్టాల్ చేయండి.

హై క్వాలిటీ వీడియోలు

మీ ఫోన్‌లో వీడియోలని హై క్వాలిటీతో చూడటానికి బదులు నార్మల్‌ క్వాలిటీతో ప్లే చేయండి. హై క్వాలిటీ వీడియోలను ప్లే చేయడం వల్ల మొబైల్ డేటా చాలా త్వరగా ఖర్చవుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories