Mobile Update: స్మార్ట్ ఫోన్ అప్‌డేట్ చేయకపోతే నష్టాలు తెలుసా?

Do you know the Risks of not Updating your Smartphone
x

Mobile Update: స్మార్ట్ ఫోన్ అప్‌డేట్ చేయకపోతే నష్టాలు తెలుసా?

Highlights

Mobile Update: స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతుల్లోనూ చూస్తున్నాం. సాప్ట్ వేర్ ను ఎప్పటికప్పుడూ ఆయా మొబైల్ కంపెనీలు అప్ డేట్ చేస్తుంటాయి.

Mobile Update: స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతుల్లోనూ చూస్తున్నాం. సాప్ట్ వేర్ ను ఎప్పటికప్పుడూ ఆయా మొబైల్ కంపెనీలు అప్ డేట్ చేస్తుంటాయి. సెక్యూరిటీ కోసం ఎప్పటికప్పుడు సాఫ్ట్ వేర్ ను అప్‌డేట్ చేస్తుంటాయి. ఒకటి ఫోన్ కు సంబంధించి ఆండ్రాయిడ్ అప్ డేట్ తో పాటు సెక్యూరిటీ అప్ డేట్స్ ను ఎప్పటికప్పుడు ఆయా సంస్థలు వినియోగదారులకు అందిస్తాయి. సాఫ్ట్ వేర్ అప్ డేట్ కు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు ఫోన్ కు వస్తుంది. ఈ అప్ డేట్ సమాచారం వచ్చిన వెంటనే ఫోన్ ను అప్ డేట్ చేసుకోవాలి. ఫోన్ అప్ డేట్ చేయకపోతే ఏం జరుగుతోందో తెలుసా?

స్మార్ట్ ఫోన్ల కంపెనీలు కనీసం ఏడాదికి ఒకసారి తమ అండ్రాయిడ్ వర్షన్ కు సంబంధించిన అప్ డేట్ ను విడుదల చేస్తాయి. సైబర్ నేరగాళ్లకు ఫోన్లు చిక్కకుండా ఉండేందుకు సైబర్ సెక్యూరిటీ ఫీచర్లను నెలకు ఒకసారి ఆ సంస్థలు విడుదల చేస్తాయి.

గూగుల్ రిలీజ్ చేసిన ఆండ్రాయిడ్ అప్ డేట్ ను మొబైల్ తయారీ కంపెనీలు యూఐకి అనుగుణంగా చిన్న చిన్న మార్పులతో విడుదల చేస్తాయి. ఓఎస్ అప్ డేట్ అయిపోయాక ఫోన్ పనిచేస్తోంది. కానీ, ఆండ్రాయిడ్ లో వచ్చే కొత్త కొత్త ఫీచర్లు మీ ఫోన్ లో రావు. అంతేకాదు పాత ఫోన్లకు సపోర్ట్ ను కూడా డెవలపర్లు నిలిపివేస్తారు. ఓఎస్ అప్ డేట్స్ ఆగిపోయిన ఒకటి లేదా రెండేళ్ల పాటు అప్ డేట్స్ వస్తాయి. సెక్యూరిటీ అప్ డేట్స్ కూడా నిలిచిపోయిన తర్వాత కొత్త ఫోన్ కొనుగోలు చేయాల్సిందే.

మొబైల్ అప్ డేట్ చేసుకోవాలని మేసేజ్ వస్తే వెంటనే అప్ డేట్ చేయాలి. లేకపోతే మొబైల్ లో సమస్యలు వస్తాయి. కొద్దిసేపటికే మొబైల్ వేడి ఎక్కుతుంది. సైబర్ నేరగాళ్లు మీ ఫోన్ ను సులభంగా హ్యాక్ చేసేందుకు అవకాశం ఉంటుంది.సైబర్ చీటర్స్ పంపిన బగ్ లు, వైరస్ లు సెక్యూరిటీ అప్ డేట్ తో తొలగిపోతాయి.

ఫ్రీ వైఫై ఉన్న చోట్ల ఫోన్లను అప్ డేట్ చేసుకోవద్దు. మీ ఇంట్లో కానీ, కార్యాలయాల్లో కానీ సెక్యూరిటీ ఉన్న వైఫై ద్వారానే ఓఎస్ అప్ డేట్ తో పాటు సెక్యూరిటీ అప్ డేట్ చేసుకోవాలి.ఓఎస్ అప్ డేట్ చేసుకోకపోతే కొత్త ఫీచర్లు రావు. అదే సమయంలో పాత ఓఎస్ లో లోపాలు సరిచేయడానికి అవకాశం కూడా ఉండదు.

Show Full Article
Print Article
Next Story
More Stories