తస్మాత్ జాగ్రత్త..ఆ లింకులు ఓపెన్ చేస్తే అంతే..

తస్మాత్ జాగ్రత్త..ఆ లింకులు ఓపెన్ చేస్తే అంతే..
x
Highlights

కరోనా వైరస్ ఉన్న వ్యక్తి చేరువలో ఉంటే కనుగొనేట్టు విధంగా ప్రభుత్వం ఆరోగ్య సేతే యాప్ ని అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

కరోనా వైరస్ ఉన్న వ్యక్తి చేరువలో ఉంటే కనుగొనేట్టు విధంగా ప్రభుత్వం ఆరోగ్య సేతే యాప్ ని అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఇలాంటి ఫేక్ యాప్ లను కొంత మంది సైబర్ నేరగాళ్లు క్రియేట్ చేసి వాటి లింకులను స్మార్ట్ ఫోన్ ఉన్న వారికి పంపిస్తున్నారు. ఒక వేల ఆ లింకులను ఎవరైనా ఓపెన్ చేస్తే వెంటనే వారి ఫోన్ డాటాను సైబర్ నేరగాళ్లు కాజేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రజల్ని ఇంటిలిజెన్స్ డిపార్ట్ మెంట్ అలర్ట్ చేసింది. సెల్ ఫోన్లలో నకిలీ 'ఆరోగ్య సేతు' యాప్‌ పేరుతో వచ్చే లింక్‌లు ఓపెన్ చెయ్యొద్దని సూచిస్తున్నారు. కొందరు సైబర్ నేరగాళ్లు ప్రభుత్వాలు రూపొందించిన ఆరోగ్యసేతు యాప్‌కు సంబంధించి నకిలీ లింక్‌లను పంపిస్తున్నారని, ఆ లింకులను ఎవరూ ఓపెన్ చేయొద్దని, ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉంటూ, జాగ్రత్త వహించాలని తెలంగాణ నిఘా విభాగం హెచ్చరించింది. ఆ లింకులన్నీ ఫేక్ అని వాటిని ఎట్టిపరిస్థితుల్లోనూ వాటిని క్లిక్ చేయొద్దంటున్నారు. సైబర్ నేరగాళ్లు ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల్ని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నరని తెలిపారు. పాక్ నుంచి సైబర్ నేరగాళ్లు పంపుతున్న లింకులను ఎట్టి పరిస్థితుల్లో కూడా లింకులు ఓపెన్ చేయొద్దని తెలిపారు.

ఈ సైబర్ నేరగాళ్లు ప్రభుత్వ ఉద్యోగులు, ఆండ్రాయిడ్‌ ఫోన్లు వినియోగించే వారినే ఎక్కువగా టార్గెట్ చేసినట్లు చెబుతున్నారు. ఈ లింక్ తెరవగానే ఫోన్‌లో 'చాట్‌ మీ' అనే యాప్‌ డౌన్‌లోడ్‌ అవుతోందని దాంతో డేటా మొత్తం మాయం చేస్తారంటున్నారు. దీని ద్వారా మొబైల్స్‌ను హ్యాక్ చేసే ప్రమాదం ఉందంటున్నారు. ఇలాంటి లింకులు వచ్చినా, ఎలాంటి అనుమానం ఉన్నా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలంటున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories