Alert: మీ ఆధార్ కార్డుపై ఎన్ని సిమ్ కార్డులు పనిచేస్తున్నాయో తెలుసా..?

Alert: మీ ఆధార్ కార్డుపై ఎన్ని సిమ్ కార్డులు పనిచేస్తున్నాయో తెలుసా..?
Alert: ఈ రోజుల్లో ఆధార్ కార్డు ఎంత ముఖ్యమైందో అందరికి తెలుసు.
Alert: ఈ రోజుల్లో ఆధార్ కార్డు ఎంత ముఖ్యమైందో అందరికి తెలుసు. అయితే మన ఆధార్‌కార్డు ఫ్రూప్‌గా పెట్టి కొంతమంది మనకి తెలియకుండానే సిమ్‌లు తీసుకొని వాడుతుంటారు. ఇలాంటి వారు వాటిని మోసాలు చేయడానికి , లేదంటే ఏదైనా అసాంఘీక కార్యక్రమాలకి వాడుతుంటారు. దీనివల్ల మనం బాధ్యులమయ్యే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి కోర్టులు, పోలీసుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది.
అయితే మీ ఆధార్‌కార్డుపై ఎన్ని సిమ్‌లు యాక్టివేట్ అయి ఉన్నాయో సులభంగా తెలుసుకోవచ్చు. మీరు ఏదైనా సిమ్‌ని వాడకుంటే దానిని ఇన్ యాక్టివేట్ చేయవచ్చు. మీ ఆధార్ నంబర్‌పై ఎన్ని సిమ్‌లు యాక్టివ్‌గా ఉన్నాయో తెలుసుకోవడానికి ప్రభుత్వం ఒక పోర్టల్‌ను ప్రారంభించింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) ఇటీవల ఫ్రాడ్ మేనేజ్‌మెంట్, కన్స్యూమర్ ప్రొటెక్షన్ (TAFCOP) కోసం టెలికాం అనలిటిక్స్ అనే పోర్టల్‌ను ప్రారంభించింది. ఈ పోర్టల్ ద్వారా వినియోగదారులు తమ ఆధార్ నంబర్‌కు లింక్ అయిన అన్ని ఫోన్ నంబర్‌లను తనిఖీ చేయవచ్చు.
TAFCOP వెబ్‌సైట్ ద్వారా మీ ఆధార్ కార్డ్‌పై ఇప్పటివరకు ఎన్ని సిమ్‌లు జారీ అయ్యాయి. అనే విషయాన్ని మీరు సులభంగా కనుగొనవచ్చు. మీకు తెలియకుండా ఏదైనా మొబైల్ నంబర్ మీ ఆధార్ నంబర్‌తో లింక్ అయితే మీరు దాని గురించి కంప్లెయింట్ చేయవచ్చు. ఇది కాకుండా మీరు మీ ఆధార్ నుంచి మీ పాత, ఉపయోగించని నంబర్‌ను సులభంగా తొలగించవచ్చు. అందుకోసం ఏం చేయాలో తెలుసుకుందాం.
1. మీ ఆధార్ లింక్ చేసిన మొబైల్ సిమ్ గురించి తెలుసుకోవడానికి ముందుగా https://tafcop.dgtelecom.gov.in/కి వెళ్లాలి.
2. ఇక్కడ మీరు మీ ఫోన్ నంబర్‌ను ఎంటర్ చేయాలి.
3. తర్వాత మీరు 'రిక్వెస్ట్ OTP' బటన్‌పై క్లిక్ చేయాలి.
4. తర్వాత మీరు మీ మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని ఎంటర్ చేయాలి.
5. అప్పుడు మీ ఆధార్ నంబర్‌కి లింక్ చేసిన అన్ని నంబర్‌లు వెబ్‌సైట్‌లో కనిపిస్తాయి.
6. వాడుకలో లేని లేదా ఇకపై అవసరం లేని నంబర్‌లను బ్లాక్ చేయవచ్చు.
నిడదవోలు వైసీపీ ప్లీనరీ సమావేశంలో నోరుజారిన తానేటి వనిత
28 Jun 2022 7:36 AM GMTబొమ్ములూరులో ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు
27 Jun 2022 4:00 PM GMTబాలినేని హాట్ కామెంట్స్.. నాపై కుట్రలు జరుగుతున్నాయి.. సొంత పార్టీ నేతలే..
27 Jun 2022 1:39 PM GMTటీ హబ్-2 ప్రారంభానికి సిద్ధం.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్
27 Jun 2022 1:31 PM GMTరైతుబంధు పంపిణీ రేపటి నుంచే.. మొదటిసారి అర్హులైన వారికి అలెర్ట్.. అలా చేస్తేనే..
27 Jun 2022 1:15 PM GMTజూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. నిందితులను గుర్తించిన బాధితురాలు
27 Jun 2022 1:00 PM GMTవ్యవసాయ బావిలో పడిన ఏనుగు.. ఐదు గంటల పాటు శ్రమించిన అటవీ అధికారులు
27 Jun 2022 12:15 PM GMT
12 కేజీల గోల్డ్ కాయిన్ ఎక్కడుంది.. 40ఏళ్ల మిస్టరీ వీడే టైమ్...
28 Jun 2022 4:00 PM GMTకృష్ణవంశీ సినిమా కోసం కవిత్వాలు చెప్పనున్న మెగాస్టార్
28 Jun 2022 3:45 PM GMTమరో చారిత్రక కనిష్ఠ స్థాయికి రూపాయి విలువ
28 Jun 2022 3:30 PM GMTనుపుర్ శర్మ ఫోటోను స్టేటస్ పెట్టుకున్నందుకు మర్డర్
28 Jun 2022 3:15 PM GMTNaga Chaitanya: ఇకపై కూడా అలానే ఉండబోతున్న అక్కినేని హీరో
28 Jun 2022 3:00 PM GMT