Google: మీకు తెలుసా.? మనం ఫ్రీగా ఉపయోగించే గూగుల్ ఆదాయం.. నిమిషానికి రూ. 2 కోట్లు..!

Do you Know Google Revenue in RS 2 Crore for one Minute
x

Google: మీకు తెలుసా.? మనం ఫ్రీగా ఉపయోగించే గూగుల్ ఆదాయం.. నిమిషానికి రూ. 2 కోట్లు..!

Highlights

Google: ఏ చిన్న సందేహం వచ్చినా సరే వెంటనే మనం చేసే పని వెంటనే గూగుల్ ఓపెన్‌ చేసి సెర్చ్‌ చేయడం.

Google: ఏ చిన్న సందేహం వచ్చినా సరే వెంటనే మనం చేసే పని వెంటనే గూగుల్ ఓపెన్‌ చేసి సెర్చ్‌ చేయడం. అంతరిక్షం నుంచి అవకాయ పచ్చడి వరకు ప్రతీ ప్రశ్నకు గూగుల్‌లో సమాధాన దొరుకుతుంది. అయితే మం గూగుల్ సేవలను ఉచితంగా యాక్సెస్ చేసుకోగలగుతాం. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యూజర్లు గూగుల్‌ను ఉపయోగిస్తున్నారు. ప్రతీ క్షణం గూగుల్‌లో లక్షల్లో ప్రశ్నలకు సమాధానాలు లభిస్తున్నాయి.

అయితే మనకు ఉచితంగా సేవలు అందిస్తున్న గూగుల్‌కు అసలు ఆదాయం ఎలా వస్తుంది.? ఎప్పుడైనా ఆలోచించారా.? ఆదాయం అంటే అదేదో చిన్నా చితక ఆదాయం కాదు. గూగుల్‌ రెండు నిమిషాల ఆదాయం ఏకంగా రూ. 2 కోట్ల అని మీకు తెలుసా.? అవును గూగుల్‌ ఆదాయం నిమిషానికి అక్షరాల రూ. 2 కోట్లు. గూగుల్‌కు ప్రధాన ఆదాయ మార్గం ప్రకటనలు. మనం ఏదైనా అంశ కోసం సెర్చ్‌ చేసే సమయంలో వెబ్‌ పేజీల్లో రకరకాల ప్రకటనలు వస్తుంటాయి. వీటి ద్వారానే గూగుల్‌కు ఆదాయం లభిస్తుంది. ఒక్కో క్లిక్‌కి ఇంతా అనేలా గూగుల్ ప్రకటనదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తుంది.

వీటితో పాటు యూట్యూబ్‌లో వచ్చే ప్రకటనల ద్వారా కూడా గూగుల్‌కు కూడా ఆదాయం లభిస్తుంది. నం బయూట్యూబ్ వీడియోలను ఉచితంగా వీక్షిస్తున్నా అందులో వచ్చే ప్రకటనలకు భారీ ఎత్తున ఆధయం లభిస్తుంది. ప్రతీ క్షణం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది వీడియోలు అప్‌లోడ్‌ అవుతున్న విషయం తెలిసిందే. వీటిలో కోట్లాది ప్రకటనలు ప్లే అవూతనే ఉంటాయి. ఇక వీటితో పాటు గూగుల్ అదనంగా పెయిడ్ సేవలు కూడా అందిస్తున్నాయి. గూగుల్‌ క్లౌడ్‌తో పాటు ప్రీమియం కంటెంట్‌ వటి సేవలకు డబ్బులు వసూలు చేస్తుంది. ఇది కూడా గూగుల్ ప్రధాన ఆదాయ వనరుల్లో ఒకటిగా చెప్పొచ్చు. ఇక గూగుల్‌ ప్లే స్టోర్‌ ద్వారా కూడా గూగుల్‌కు ఆదాయం వస్తుంది. ఇవన్నీ కలుపుకుంటే గూగుల్‌కు ప్రతీ నిమిషానికి రూ. 2 కోట్ల ఆదాయం లభస్తుందన్నమాట.

Show Full Article
Print Article
Next Story
More Stories