Laptop Mistakes: ల్యాప్‌టాప్‌ విషయంలో ఈ పొరపాట్లు చేయవద్దు.. ప్రమాదంలో పడుతారు..!

Do not make these mistakes in case of Laptop you will be in danger
x

Laptop Mistakes: ల్యాప్‌టాప్‌ విషయంలో ఈ పొరపాట్లు చేయవద్దు.. ప్రమాదంలో పడుతారు..!

Highlights

Laptop Mistakes: ఈ రోజుల్లో ఆఫీస్‌ వర్క్‌ నుంచి పిల్లల హోమ్‌వర్క్‌ వరకు అందరూ ఇండ్లలో ల్యాప్‌టాప్‌లను ఉపయోగిస్తున్నారు.

Laptop Mistakes: ఈ రోజుల్లో ఆఫీస్‌ వర్క్‌ నుంచి పిల్లల హోమ్‌వర్క్‌ వరకు అందరూ ఇండ్లలో ల్యాప్‌టాప్‌లను ఉపయోగిస్తున్నారు. కరోనా సమయంలో వర్క్‌ ఫ్రం హోం వల్ల వీటి అవసరం చాలా పెరిగింది. గతంలో కంటే ఇప్పుడు ధరలు కూడా తగ్గాయి. అయితే ల్యాప్‌టాప్‌ని వినియోగి స్తుంటే కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. సిస్టమ్ తరచుగా కొన్ని సంకేతాలను ఇస్తుంది వాటిని అస్సలు విస్మరించకూడదు. దీనివల్ల మీరు ఇబ్బందుల్లో పడుతారు. ల్యాప్‌టాప్‌ ఆపరేట్ సమయంలో ఎదురయ్యే సమస్యల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

ల్యాప్‌టాప్‌లు ఏవైనా సరే కొన్ని రోజుల వినియోగం తర్వాత అవి ఓవర్‌ హీట్‌ అవుతాయి. దీనికి అనేక కారణాలు ఉంటాయి. ఎక్కువగా ల్యాప్‌టాప్‌లో ఇన్‌స్టాల్ చేసిన కూలింగ్ ఫ్యాన్ సరిగా పనిచేయకపోవడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. ఇలాంటి సమయంలో ఒక్కసారి ఫ్యాన్‌ చెక్‌ చేయాలి. అలాగే దుమ్ము పేరుకుపోవడం వల్ల కూడా ల్యాప్‌టాప్ వేడెక్కుతుంది. అందుకే ప్రతి రెండు, నాలుగు రోజులకొకసారి క్లీన్‌ చేస్తూ ఉండాలి. అయినప్పటికీ వేడెక్కుతుంటే టెక్నీషియన్‌ దగ్గరికి తీసుకెళ్లి చూపించాలి.

కొన్ని ల్యాప్‌టాప్‌లు ఛార్జింగ్ పెడితేనే రన్‌ అవుతాయి. అంటే వాటి బ్యాటరీ పూర్తిగా చెడిపో యిందని అర్థం. ఇలాంటి సమయంలో వెంటనే కొత్త బ్యాటరీని అమర్చాలి. లేదంటే పాత ఉబ్బిన బ్యాటరీతోనే ల్యాప్‌టాప్‌ నడిపిస్తే అది పేలిపోతుంది. ల్యాప్‌ రన్‌ అవుతున్నప్పుడు వేడి జనరేట్ అవుతుంది. అది ఎప్పటికప్పుడు బయటికి వెళ్లిపోవాలి. లేదంటే పరికరం హీట్‌ అవుతూ ఉంటుంది. ఈ సమస్యను పరిష్కరించినట్లయితే ల్యాప్‌టాప్‌ చాలా కాలం పనిచేస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories