త్వరలో మీ ఇంటికి వచ్చేస్తుంది ఓలా స్కూటర్..! టెస్ట్ డ్రైవ్‌కి సిద్దమేనా..?

Ola Electric Scooter: ఇప్పటి వరకు లక్షల మంది ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ని బుక్ చేసుకున్నారు.

hmtv Digital Team
Updated on: 8 Nov 2021 10:16 PM IST
Delivery of the Ola Electric Scooter Test Drive‌ Begins Next Week
X
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ (ఫైల్ ఇమేజ్)

Ola Electric Scooter: ఇప్పటి వరకు లక్షల మంది ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ని బుక్ చేసుకున్నారు. టెస్ట్ డ్రైవ్, డెలివరీ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓలా ఎలక్ట్రిక్‌ అధినేత భవిష్‌ అగర్వాల్‌ ఓ ట్వీట్‌ చేశారు. వచ్చే వారం నుంచి టెస్ట్ డ్రైవ్ ప్రారంభమవుతుందని తెలిపారు. ఆ తర్వాత దాని డెలివరీ కూడా ప్రారంభమవుతుందని చెప్పారు. అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీ గురించి ఓలా ఇంకా సమాచారం ఇవ్వలేదు. ఓలా ఎలక్ట్రిక్ సెప్టెంబర్‌లో తన ఎలక్ట్రిక్ స్కూటర్ S1 విక్రయానికి బుకింగ్ ప్రక్రియను ప్రారంభించింది. దీనికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది.

Ola Electric దాని Ola S1, Ola S1 ప్రో అనే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను పరిచయం చేసింది. ఇక్కడ Ola S1 ధర రూ.99999 కాగా, Ola S1 ప్రో ధర రూ.1.29 లక్షలు.

Ola S1, Ola S1 ప్రో సరికొత్త ఫీచర్‌లతో నిండి ఉన్నాయి. Ola S1 ఐదు అద్భుతమైన రంగులలో వస్తుంది. ఇది భారీ బూట్ స్పేస్‌తో వస్తుంది. దీనితో పాటు ఐకానిక్ హెడ్‌ల్యాంప్‌లు ఇందులో అమర్చారు. ఈ స్కూటర్ గంటకు 90 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోగలదు.

అలాగే ఇది 0-40 కి.మీ వేగాన్ని 3.6 సెకన్లలో అందుకుంటుంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 121 కిమీల రేంజ్‌ను అందిస్తుంది. దీనితో పాటు, సాధారణ స్పోర్ట్స్ మోడ్‌లు ఇందులో ఇచ్చారు. Ola S1 ప్రో గురించి మాట్లాడితే.. ఇది 10 అద్భుతమైన రంగులలో వస్తుంది. ఇది గరిష్టంగా 115 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. ఇది ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 181 కిలోమీటర్ల వరకు నడుస్తుంది. అలాగే ఈ స్కూటర్ కేవలం 3.0 సెకన్లలో 0-40 కిలోమీటర్ల పరిధిని చేరుకుంటుంది. ఇందులో నార్మల్, స్పోర్ట్స్, హైపర్ వంటి మోడ్స్ ఇచ్చారు.

hmtv Digital Team

hmtv Digital Team

Next Story