Vivo Y300 5G: తక్కువ బడ్జెట్‌లో వావ్‌ అనిపించే ఫీచర్స్‌.. వివో కొత్త ఫోన్‌..!

Vivo Y300 5G: బడ్జెట్‌ మార్కెట్‌ను టార్గెట్‌ చేసుకొని మార్కెట్లోకి రోజుకో కొత్త స్మార్ట్‌ ఫోన్‌లు వస్తున్నాయి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 21 Nov 2024 5:12 PM IST
China Based Smart Phone Company Vivo Launches New Smartphone Vivo Y300 Features and Price Details
X

Vivo Y300 5G: తక్కువ బడ్జెట్‌లో వావ్‌ అనిపించే ఫీచర్స్‌.. వివో కొత్త ఫోన్‌..!

Vivo Y300 5G: బడ్జెట్‌ మార్కెట్‌ను టార్గెట్‌ చేసుకొని మార్కెట్లోకి రోజుకో కొత్త స్మార్ట్‌ ఫోన్‌లు వస్తున్నాయి. ముఖ్యంగా చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ తయారీ కంపెనీలు కొంగొత్త ఫోన్‌లతో యూజర్లను ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ కంపెనీ వివో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. వివో వై300 పేరుతో 5జీ ఫోన్‌ను లాంచ్‌ చేశారు. నిజానికి ఈ ఫోన్‌కు సంబంధించి చాలా రోజుల నుంచి వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఎట్టకేలకు ఈ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

వివో వై300 స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. 6.67 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 120 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌ ఈ స్క్రీన్‌ సొంతం. ఇక ఈ ఫోన్‌ క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 4 జెన్‌ 2 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. దీంతో ఈ ఫోన్‌ మల్టీ టాస్కింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. ఇక వివో వై300 ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పనిచేస్తుంది.

ఇక కెమెరాకు కూడా ఈ ఫోన్‌లో అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన Sony IMX882 రెయిర్‌ కెమెరాను అందించారు. అలాగే ఇందులో సెల్పీలు, వీడియో కాల్స్‌ కోసం 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను ఇచ్చారు. పోర్ట్రెయిట్, నైట్, వీడియో, పనో, డాక్యుమెంట్స్, స్లో-మో, టైమ్-లాప్స్ వంటి కెమెరా ఫీచర్లను ప్రత్యకంగా అందించారు. ఇవి ఫొటోగ్రఫీ ఎక్స్‌పీరియన్స్‌ను మెరుగుపరుస్తాయి.

ఇక బ్యాటరీ విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 80 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కి సపోర్ట్‌ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ కెపాసిటీ గల బ్యాటరీని అందించారు. ఇక కనెక్టివిటీ కోసం ఇందులో బ్లూటూత్‌ 5.0, యూఎస్‌బీ 2.0, వైఫై వంటి ఫీచర్లను అందించారు. ధర విషయానికొస్తే.. వివో వై 300 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 21,999కాగా.. 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 23,999గా నిర్ణయించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story