Jio Anniversary Offer: జియో నుంచి అదిరిపోయే ఆఫర్స్.. ఆ 3 రీఛార్జీలపై రూ.700ల బెనిఫిట్స్.. ఫ్రీగా ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్

జియో వార్షికోత్సవంలో భాగంగా ఈ రీఛార్జ్‌లపై రూ.175ల వోచర్‌ ఇస్తోంది. దీంతో 28 రోజుల పాటు 10 ఓటీటీల సబ్‌స్క్రిప్షన్స్, 10జీబీ డేటా కూడా పొందవచ్చు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 5 Sept 2024 8:47 PM IST
Check Jio Anniversary Offers and Benifits with these 3 recharge plans
X

Jio Anniversary Offer: జియో నుంచి అదిరిపోయే ఆఫర్స్.. ఆ 3 రీఛార్జీలపై రూ.700ల బెనిఫిట్స్.. ఫ్రీగా ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్

Jio Anniversary Offer: రిలయన్స్‌ జియో స్పెషల్ ఆఫర్‌ ప్రకటించింది. తమ యూజర్ల కోసం రిలయన్స్ కనీవినీ ఎరుగని ఆఫర్లతో ముందుకొచ్చింది. 8వ వార్షికోత్సవం సందర్భంగా రూ.700 విలువ చేసే ప్రయోజనాలను అందించనుంది. కాగా, ఈ ఆఫర్లు ఇప్పటికే యూజర్లకు అందుబాటులోకి ఉన్నాయి. సెప్టెంబర్‌ 5 నుంచి 10 లోపు రీఛార్జి చేసుకున్నయూజర్లకు మాత్రమే ఈ ప్రయోజనాలు దక్కనున్నాయి.

జియో వార్షికోత్సవంలో భాగంగా ఈ రీఛార్జ్‌లపై రూ.175ల వోచర్‌ ఇస్తోంది. దీంతో 28 రోజుల పాటు 10 ఓటీటీల సబ్‌స్క్రిప్షన్స్, 10జీబీ డేటా కూడా పొందవచ్చు. అలాగే, ఈ ఆఫర్‌లో భాగంగా 3 నెలల పాటు ఫ్రీగా జొమాటో గోల్డ్‌ మెంబర్‌షిప్‌ అందివ్వనున్నట్లు కంపెనీ తెలిపింది. అలాగే, మరో రూ.500 విలువైన Ajio వోచర్‌ యూజర్లకు అందివ్వనుంది. అయితే, Ajioలో రూ.2,999 లేదా అంతకంటే ఎక్కువ మొత్తంలో షాపింగ్ చేసినప్పుడే ఈ కూపన్ వర్తించనుంది. కాగా, ఈ ఆఫర్లు 3 రీఛార్జీలకు మాత్రమే వర్తిస్తాయని కంపెనీ తెలిపింది.

ఆ ప్లాన్లు ఏవంటే..

రూ.899, రూ. 999, రూ. 3599ల ప్లాన్‌లకు ఈ ఆఫర్లు ఇవ్వనున్నట్లు కంపెనీ తెలిపింది. కాగా, రూ. 899ల ప్లాన్‌లో భాగంగా 90 రోజల వ్యాలిడిటీ, రోజుకు 2జీబీ డేటా, అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు అందివ్వనుంది. అలాగే, ఈ ప్లాన్‌తో మరో 20జీబీ డేటా అదనంగా ఇస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

రూ.999ల ప్లాన్‌ ఎంచుకుంటే 98 రోజుల వ్యాలిడిటీతోపాటు రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు, అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, రోజుకు 2జీబీ డేటా పొందవచ్చు.

రూ.3,599ల ప్లాన్‌ రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లతోపాటు 2.5జీబీ డేటా, అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, 365 రోజుల వ్యాలిడిటీని అందించనుంది.



హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story