Car Discount : కారు కొనేవారికి శుభవార్త.. నెక్సాన్‌కు పోటీ ఇచ్చే ఎస్యూవీపై రూ. 89,000 వరకు భారీ తగ్గింపు

Car Discount Huge Offers on Mahindra XUV 3XO, a Rival to Tata Nexon!
x

Car Discount : కారు కొనేవారికి శుభవార్త.. నెక్సాన్‌కు పోటీ ఇచ్చే ఎస్యూవీపై రూ. 89,000 వరకు భారీ తగ్గింపు

Highlights

Car Discount : కారు కొనేవారికి శుభవార్త.. నెక్సాన్‌కు పోటీ ఇచ్చే ఎస్యూవీపై రూ. 89,000 వరకు భారీ తగ్గింపు

Car Discount : కొత్త ఎస్యూవీ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? మీ బడ్జెట్ రూ.10 లక్షల లోపు ఉందా? అయితే, ఈ నెలలో మీకోసం ఒక అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. టాటా నెక్సాన్‌కు గట్టి పోటీ ఇచ్చే మహీంద్రా XUV 3XO SUVపై ఏకంగా రూ.44,000 నుంచి రూ.89,000 వరకు భారీ తగ్గింపు లభిస్తోంది. ఇందులో క్యాష్ డిస్కౌంట్, కార్పొరేట్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, యాక్సెసరీలు వంటివి ఉన్నాయి. ఈ తగ్గింపు పెట్రోల్, డీజిల్ వేరియంట్‌ల రెండింటిపై లభిస్తోంది.

ఈ కారులోని వివిధ వేరియంట్‌లపై లభించే డిస్కౌంట్ వివరాల్లోకి వెళితే.. AX7 L డీజిల్ వేరియంట్‌పై అత్యధికంగా రూ.89,000 వరకు తగ్గింపు ఉంది. AX7 L పెట్రోల్ వేరియంట్ పై రూ.84,000 వరకు తగ్గింపు లభిస్తోంది. AX7 పెట్రోల్ వేరియంట్ పై రూ.64,000 వరకు తగ్గింపు ఉంది. MX2 Pro, MX2, MX3 Pro, MX3, AX5, AX7 డీజిల్ వేరియంట్‌లపై రూ.69,000 వరకు తగ్గింపు లభిస్తోంది. AX5 L పెట్రోల్ వేరియంట్ పై రూ.44,000 వరకు తగ్గింపు ఉంది.

గతేడాది విడుదలైన మహీంద్రా XUV 3XO కారు ధర రూ.7.99 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి రూ.15.80 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ఈ కారు టాటా నెక్సాన్‌తో పాటు మారుతి సుజుకి ఫ్రాంక్స్, స్కోడా కుషాక్, హ్యుందాయ్ వెన్యూ, నిస్సాన్ మాగ్నైట్, హ్యుందాయ్ ఎక్స్‌టర్, కియా సోనెట్, రెనాల్ట్ కైగర్ వంటి కార్లకు కూడా గట్టి పోటీ ఇస్తుంది.

మహీంద్రా XUV 3XOకు పోటీగా, టాటా మోటార్స్ కూడా తమ పాపులర్ SUV నెక్సాన్‌పై డిస్కౌంట్‌లను అందిస్తోంది. టాటా నెక్సాన్ 2024 (పెట్రోల్, సీఎన్‌జీ, డీజిల్) వేరియంట్‌లపై రూ.45,000 వరకు తగ్గింపు లభిస్తోంది. 2025 వేరియంట్‌లపై (సీఎన్‌జీ, పెట్రోల్, డీజిల్) రూ.30,000 వరకు తగ్గింపు పొందే అవకాశం ఉంది. ఈ డిస్కౌంట్ ఆఫర్లు ఆగస్టు 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. వివిధ రాష్ట్రాల్లో ఆఫర్ల మొత్తం మారవచ్చు. కాబట్టి, మరింత సమాచారం కోసం మీ దగ్గరలోని మహీంద్రా లేదా టాటా మోటార్స్ డీలర్‌ను సంప్రదించండి.

Show Full Article
Print Article
Next Story
More Stories