Portable AC: ఈ పోర్టబుల్ ఏసీలతో నిమిషాల్లోనే రూమంతా కూలింగ్.. అందుబాటు ధరల్లోనే..!

Portable AC: ఎండ వేడిని తట్టుకోవడానికి AC లేదా కూలర్‌ని కొనుగోలు చేయాలని చూస్తున్నారా?

Arun Chilukuri
Updated on: 24 April 2023 2:36 PM IST
Buy These 3 Mini Portable Air Cooler With Low Price in Online Check Full List
X

Portable AC: వేసవిలో వింటర్ సీజన్.. ఈ పోర్టబుల్ ఏసీలతో నిమిషాల్లోనే రూం కూలింగ్.. ధర తెలిస్తే షాకే..!

Portable AC: ఎండ వేడిని తట్టుకోవడానికి AC లేదా కూలర్‌ని కొనుగోలు చేయాలని చూస్తున్నారా? అయితే, రూ.2000లోపు బెస్ట్ పోర్టబుల్ ఏసీలను మీ ముందుకు తీసుకొచ్చాం. ధరలో చాలా తక్కువగానే ఉన్నా.. కూలింగ్‌ ఇవ్వడంలో మాత్రం చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఇది పోర్టబుల్ కూలర్, వీటిని ఎక్కడైనా ఉంచుకోవచ్చు. మార్కెట్‌లోనూ ఈ పోర్టబుల్ ఏసీలు భారీగా అమ్ముడుపోతున్నాయి. ఇంట్లో వేడిని తగ్గించుకోవాలనుకుంటే ఇటువంటి అనేక కూలర్ల గురించి ఓసారి చూద్దాం..

పోర్టబుల్ ఎయిర్ కండీషనర్ చాలా తక్కువ ప్లేస్‌ను ఆక్రమిస్తాయి. విద్యుత్ ఖర్చు కూడా చాలా తక్కువ. ఇందులో కూలింగ్ కోసం 3 స్పీడ్ ఫ్యాన్లు ఇచ్చారు. మినీ పర్సనల్ ఎయిర్ కూలర్ కూడా ఇందులో అందించారు. దీనిలో మీరు 500 ml నీటిని వాడుకుని, దాదాపు 8 గంటలకు వరకు కూలింగ్ అందిస్తాయి. ఎయిర్ ప్యూరిఫికేషన్ ఫిల్టర్లను కూడా ఇందులో అందించారు. మీరు ఈ కూలర్ ధర రూ. 1,999కి పొందవచ్చు.

Krooh Mini portable Air Cooler..

ఇది వేసవికి బాగా ఉపయోగపడే మినీ కూలర్. ఈ కూలర్ ముఖ్యంగా చిన్న గదులలో బాగా పనిచేస్తుంది. దీనితో పాటు, మీకు 3 స్పీడ్ కూలింగ్ ఆప్షన్‌ కూడా అందించారు. ఈ పరికరాన్ని ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లవచ్చు. ఇన్‌స్టాల్ చేయవచ్చు. మార్కెట్‌లో రూ.1500 మాత్రమే లభిస్తుంది.

NL Traders Mini Cooler..

ఈ కూలర్‌లో LED లైట్ మోడ్, నీటి ఫిల్టర్ మోడ్‌లు అందించారు. ఇది గదిని చల్లగా ఉంచడంలో ఎంతో బాగా ఉపయోగపడుతుంది. దీన్ని ఆఫీసులో లేదా ఇంట్లో ఎక్కడైనా ఉపయోగించవచ్చు. వాకింగ్ కోసం కూడా తీసుకెళ్లోచ్చు. దీన్ని కొనాలంటే రూ.3,000 వెచ్చించాల్సి ఉంటుంది.

VVX Mini Portable Air Cooler..

ఈ కూలర్‌ను ఉపయోగించాలంటే అందులో నీటిని నింపాలి. ఆ తర్వాత మైక్రో USB తో రన్ చేయవచ్చు. ఈ కూలర్‌ను కారులోనూ ఉంచుకోవచ్చు. మీతో ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. దీనిలో కూడా 3 కంట్రోల్ ఆప్షన్స్ కూడా ఇచ్చారు. ఇది ఫ్యాన్‌తో పోలిస్తే 7 డిగ్రీల ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. ఇది రూ.2,000లలోపే మార్కెట్‌లో లభిస్తుంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story