Portable AC: సిమ్లా లాంటి చల్లదనం.. కేవలం రూ.1500లోపే.. ఈ పోర్టబుల్ ఏసీ ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే..!

Mini Arctic Ultra Air Cooler: వేసవికాలంలో ఉక్కపోత, వేడి నుంచి తట్టుకోవడానికి ఏసీలు, కూలర్లను ఉపయోగిస్తుంటాం.

Arun Chilukuri
Updated on: 20 April 2023 4:18 PM IST
Buy Mini Arctic Ultra Air Cooler on Amazon for Just RS 1299
X

Portable AC: సిమ్లా లాంటి చల్లదనం.. కేవలం రూ.1500లోపే.. ఈ పోర్టబుల్ ఏసీ ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే..!

Mini Arctic Ultra Air Cooler: వేసవికాలంలో ఉక్కపోత, వేడి నుంచి తట్టుకోవడానికి ఏసీలు, కూలర్లను ఉపయోగిస్తుంటాం. అయితే, వీటి వాడకంతో కరెంట్ బిల్లులు పెరిగిపోతుంటాయి. అలాగే వీటి ఖరీదు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవి వేడి నుంచి ఉపశమనం అందించడంతో పాటు, విద్యుత్ బిల్లును అనేక రెట్లు పెంచుతుంది. ఇటువంటి పరిస్థితిలో అధిక కరెంటు బిల్లు కారణంగా, సామాన్యుడి బడ్జెట్ దెబ్బతింటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. దాని కారణంగా ఇతర ఖర్చులు తగ్గించవలసి ఉంటుంది.

అయితే రూ.1,500 లోపు లభిస్తుంన్న ఓ మినీ ఎయిర్ కూలర్ గురించి ఈరోజు మీకు చెప్పబోతున్నాం. దీనిని USB కేబుల్ సహాయంతో సులభంగా అపరేట్ చేసుకోవచ్చు. ఇది తక్కువ శక్తిని వినియోగిస్తుంది. వేడి నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది.

Amazon నుంచి ఈ Mini Air Cooler కొనొచ్చు. ఈ మినీ ఎయిర్ కూలర్ అసలు పేరు మినీ ఆర్కిటిక్ అల్ట్రా ఎయిర్ కూలర్. ఈ కూలర్ పరిమాణం చాలా చిన్నది. దీనిని గదిలోని ఏ మూలలోనైనా సులభంగా ఫిక్స్ చేసుకోవచ్చు. దీనిని ల్యాప్‌టాప్ లేదా పవర్ బ్యాంక్ USB కేబుల్ సహాయంతో ఆపరేట్ చేయవచ్చు.

ఈ మినీ ఎయిర్ కూలర్‌ నడించేందుకు కేవలం 8 వాట్ల పవర్ అవసరం. దీని బరువు 900 గ్రాములు మాత్రమే. ఈ మిని పోర్టబుల్ ACలో కూల్, ప్యూరిటీ, హ్యుమిడిటీ అనే 3 రకాల ఆఫ్షన్స్ అందుబాటులో ఉన్నాయి. అలాగే ఫ్యాన్ వేగాన్ని నియంత్రించడానికి ఒక బటన్ కూడా అందించారు.

మీరు ఈ మినీ ఎయిర్ కూలర్ వాటర్ ట్యాంక్‌లో నీటిని నింపగానే, ఇది చల్లటి గాలిని మీకు అందిస్తుంది. ఈ మినీ ఏసీ పొడవు 19 సెంటీమీటర్లు. వాటర్ ట్యాంక్ నిండితే 8 గంటల పాటు నిరంతరం చల్లటి గాలిని ఇవ్వగలదు. ఇది మాత్రమే కాదు, ఈ మినీ ఏసీ గదిలో వేడి గాలిని తగ్గించేలా చేస్తుంది. దీని కారణంగా గది ఉష్ణోగ్రత చాలా చల్లగా మారుతుంది.

మీరు ఈ మినీ ఎయిర్ కూలర్‌ను ఇ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ నుంచి సులభంగా కొనుగోలు చేయవచ్చు. దీని ధర రూ. 1,299లు. మరోవైపు, మీరు HSBC బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌తో కొనుగోలు చేస్తే, మీరు ప్రోడక్ట్‌పై రూ. 61 అదనపు తగ్గింపును పొందుతారు. అదే సమయంలో మీరు ఈ మినీ ఎయిర్ కూలర్‌ను ఉచిత హోమ్ డెలివరీ, 10 రోజుల రిటర్న్ పాలసీని కూడా పొందవచ్చు.



Arun Chilukuri

Arun Chilukuri

Next Story