BSNL 4G Network: రేపు దేశవ్యాప్తంగా BSNL 4జీ సేవలు ప్రారంభం

BSNL 4G Network: రేపు దేశవ్యాప్తంగా BSNL 4జీ సేవలు ప్రారంభం
x
Highlights

BSNL 4G Network: పూర్తి స్వదేశీ టెక్నాలజీతో BSNL దేశవ్యాప్తంగా 4జీ సేవల ప్రారంభానికి సిద్ధమైంది.

BSNL 4G Network: పూర్తి స్వదేశీ టెక్నాలజీతో BSNL దేశవ్యాప్తంగా 4జీ సేవల ప్రారంభానికి సిద్ధమైంది. రేపు ప్రధాని ఒడిశాలోని ఝార్సుగూడ నుంచి ఈ 4జీ సేవలను ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 97వేల సైట్‌లను ప్రారంభించనున్నట్టు తెలిపారు తెలంగాణ సర్కిల్ చీఫ్‌ జనరల్ మేనేజర్ రత్నం.

BSNL సిల్వర్ జూబ్లీ సంవత్సరంలో, భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ఇంటిగ్రేషన్‌తో స్వదేశీ కోర్‌పై పాన్-ఇండియా 4Gని ప్రారంభిస్తోందని అన్నారు. ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతను ఈ ప్రాజెక్ట్‌ పునరుద్ఘాటిస్తుందని చెప్పారు. డిజిటల్ భారత్ నిధి కింద మారుమూల ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్ ‌సౌకర్యం కల్పిస్తామని అన్నారు మేనేజర్ రత్నం.

Show Full Article
Print Article
Next Story
More Stories