BSNL సూపర్‌ ప్లాన్‌.. ఏడాది పొడవునా అపరిమిత కాలింగ్, డేటా ప్రయోజనాలు..!

BSNL Super Plan: ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) వినియోగదారుల కోసం కొత్త కొత్త ప్లాన్లని ప్రవేశపెడుతుంది.

Jyothi
Updated on: 28 Aug 2023 7:00 AM IST
BSNL Super Annual Plan Unlimited calling data Benefits throughout the Year
X

BSNL సూపర్‌ ప్లాన్‌.. ఏడాది పొడవునా అపరిమిత కాలింగ్, డేటా ప్రయోజనాలు..!

BSNL Super Plan: ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) వినియోగదారుల కోసం కొత్త కొత్త ప్లాన్లని ప్రవేశపెడుతుంది. ఇవి తక్కువ ధరలో ఎక్కువ ప్రయోజనాలని అందిస్తాయి. జియో, ఎయిర్‌టెల్‌ రీఛార్జ్‌ ధరల కంటే ఇవి చాలా సరసమైన ధరలలో లభిస్తాయి. మీరు ఒకవేళ వార్షిక ప్లాన్‌ కోసం చూస్తున్నట్లయితే BSNL నుంచి అనేక ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో రూ.1,515 ప్లాన్‌ చాలా బెస్ట్‌గా ఉంటుంది. ఈ ప్లాన్ ప్రత్యేకత, ధర తదితర విషయాల గురించి ఈరోజు తెలుసుకుందాం.

BSNL వార్షిక రీఛార్జ్ ప్లాన్

BSNL రూ.1,515 ప్లాన్ ఏడాది పాటు చెల్లుబాటు అవుతుంది. అంటే ఒక్క రీఛార్జ్‌తో ఏడాది పొడవునా చింత లేకుండా ఉండవచ్చు. దీనివల్ల ప్రతి నెల రీఛార్జ్ అవసరం ఉండదు. ఈ ప్లాన్‌లో కస్టమర్‌లు ప్రతిరోజూ 2GB డేటాను పొందుతారు. అంటే మొత్తం ఏడాది పొడవునా 720GB ఇంటర్నెట్ డేటాను పొందుతారు.

రూ.1,515 ప్లాన్ ప్రయోజనాలను

ఈ ప్లాన్‌లో కస్టమర్‌లు అపరిమిత వాయిస్ కాలింగ్‌తో పాటు ప్రతిరోజూ 100 ఉచిత SMS సౌకర్యాన్ని పొందుతారు. ఇంకా హై ఇంటర్నెట్ స్పీడ్ డేటా అందుతుంది. ఒకవేళ డేటా ముగిసినప్పటికీ 40Kbps వేగంతో బ్రౌజ్ చేసే అవకాశం ఉంటుంది. ఇవన్నీ BSNL వార్షిక బడ్జెట్ ప్లాన్‌లలో చేర్చారు. కానీ ఈ ప్లాన్‌ OTT సేవల సభ్యత్వాన్ని మాత్రం కలిగి ఉండదు.

ప్రతి నెలా రూ.126 ఖర్చు

రూ.1,515 బీఎస్‌ఎన్‌ఎల్ వార్షిక ప్లాన్‌కు నెలవారీ ధరను పరిశీలిస్తే రూ.126 మాత్రమే అవుతుంది. నెలవారీ రూ.126తో వినియోగదారులు 12 నెలల పాటు అపరిమిత కాలింగ్, ఉచిత SMS, 720GB ఇంటర్నెట్ డేటా పొందుతారు. ఈ వార్షిక ప్లాన్ తీసుకుంటే చాలా డబ్బు ఆదా చేసుకోవచ్చు.

Jyothi

Jyothi

Next Story