BSNL Recharge: బీఎస్‌ఎన్‌ఎల్‌ చౌకైన రీఛార్జ్‌ ప్లాన్‌.. అతి తక్కువ ధరలో 3 నెలల వ్యాలిడిటీ..!

BSNL RS 22 Recharge Plan With Three Months Validity Check for Details
x

BSNL Recharge: బీఎస్‌ఎన్‌ఎల్‌ చౌకైన రీఛార్జ్‌ ప్లాన్‌.. అతి తక్కువ ధరలో 3 నెలల వ్యాలిడిటీ..!

Highlights

BSNL Recharge: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు స్మార్ట్‌ఫోన్‌ వాడుతున్నారు. కానీ ఇందులో కొంతమంది ఇంటర్నెట్‌ని ఉపయోగించరు.

BSNL Recharge: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు స్మార్ట్‌ఫోన్‌ వాడుతున్నారు. కానీ ఇందులో కొంతమంది ఇంటర్నెట్‌ని ఉపయోగించరు. చాలా తక్కువ కాల్స్‌ చేస్తారు. ఇందుకోసం చాలా ఖరీదైన ప్లాన్‌ తీసుకొని డబ్బులని వృథా చేసుకుంటారు. ఇలాంటి వారికోసం బీఎస్‌ఎన్‌ఎల్‌ ఓ సరికొత్త చౌకైన ప్లాన్‌ని ప్రవేశపెట్టింది. దీని ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ రీఛార్జ్‌ అతిపెద్ద ప్రయోజనం మూడు నెలలు వ్యాలిడిటీ రావడం. ఈ చౌకైన ప్లాన్‌ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

బీఎస్‌ఎన్‌ఎల్‌ అనేది దేశంలోని ప్రభుత్వ టెలికాం కంపెనీ. ఇది భారతీయ కస్టమర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అతి తక్కువ ధరలో రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తుంది. ఇందులో భాగంగా రూ. 22 రీఛార్జ్‌ ప్లాన్‌ని ప్రవేశపెట్టింది. ఇంటర్నెట్‌ ఉపయోగించని కస్టమర్ల కోసం ఈ ప్లాన్‌ బాగా ఉపయోగపడుతుంది. ఈ చౌకైన ప్లాన్‌లో 90 రోజులు అంటే 3 నెలల వ్యాలిడిటీ వస్తుంది. బీఎస్‌ఎన్‌ఎల్‌ కాకుండా వేరే నెట్‌వర్క్‌ అయితే ఇందుకోసం చాలా ఖర్చు చేయాల్సి ఉంటుంది.

అంతేకాదు ఈ రీఛార్జ్‌ ప్లాన్‌లో మరో ప్రయోజనం కూడా ఉంది. అది లోకల్, STD కాల్స్‌కి నిమిషానికి 30 పైసల కాల్ రేటు మాత్రమే వసూలు చేస్తారు. డబ్బును ఆదా చేసుకోవాలనుకుంటే ఈ రీఛార్జ్ ప్లాన్ బాగా ఉపయోగపడుతుంది. ఇతర టెలికాం కంపెనీలు చౌకైన రీఛార్జ్‌ ప్లాన్లని ఎత్తివేయడంతో కస్టమర్లు ఈ ప్లాన్‌పై అత్యంత ఆసక్తి చూపుతున్నారు. మీరు కూడా ఇంటర్నెట్‌ వాడని వారైతే ఈ రీఛార్జ్‌ ప్లాన్‌ బాగా పనికొస్తుందని గుర్తుంచుకోండి.

Show Full Article
Print Article
Next Story
More Stories