BSNL Diwali Offer: బీఎస్ఎన్ఎల్ సరికొత్త ప్లాన్..తక్కువ ధరకే కాలింగ్, డేటా!

BSNL Diwali Offer: ప్రైవేట్ టెలికాం కంపెనీలు రీఛార్జ్ ప్లాన్‌లను పెంచినప్పటి నుంచి బీఎస్ఎన్ఎల్‌కి ప్రతి నెలా లక్షలాది మంది మారుతున్నారు.

BSNL Diwali Offer
X

BSNL Diwali Offer

BSNL Diwali Offer: ప్రైవేట్ టెలికాం కంపెనీలు రీఛార్జ్ ప్లాన్‌లను పెంచినప్పటి నుంచి బీఎస్ఎన్ఎల్‌కి ప్రతి నెలా లక్షలాది మంది మారుతున్నారు. ఎందుకంటే బీఎస్ఎన్ఎల్ బడ్జెట్ ప్లాన్లను అందిస్తుంది. దీని కారణంగా గత రెండు-మూడు నెలల్లో బీఎస్ఎన్ఎల్ వినియోగదారుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగింది. జూలైలో బీఎస్ఎన్ఎల్ దాదాపు 30 లక్షల మంది కొత్త కస్టమర్లను చేర్చుకుంది. జూన్ 30, 2024 వరకు 8.577 కోట్ల కంటే ఎక్కువ మంది కస్టమర్‌లు ఉన్నారు. కంపెనీ ఇప్పుడు కోట్లాది మంది వినియోగదారులకు దీపావళి కానుకలను అందించింది. తన చౌక రీఛార్జ్ ప్లాన్‌లలో ఒకదానిపై ఉచితంగా 3GB డేటాను అందిస్తోంది. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కంపెనీ తన సరసమైన రూ. 499 ప్లాన్‌తో ప్రత్యేక ఆఫర్‌ను అందిస్తోంది. ఇప్పుడు ఈ ప్లాన్‌లో లభించే సాధారణ ప్రయోజనాలే కాకుండా కస్టమర్‌లు 3GB అదనపు డేటాను కూడా ఉచితంగా పొందుతారు.

రూ. 499 ప్లాన్ ప్రయోజనాలు

1. ఈ ప్లాన్‌లో మీకు 70 రోజుల పూర్తి వాలిడిటీ లభిస్తుంది.

2. ప్లాన్‌లో రోజు2GB డేటా లభిస్తుంది

3. అంటే 70 రోజుల్లో మొత్తం 140GB డేటా.

4. అలానే ఇప్పుడు 3GB అదనపు డేటా కూడా ఉచితంగా లభిస్తుంది

5. మొత్తం డేటా 143GBకి చేరుకుంటుంది.

6. ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ కూడా అందుబాటులో ఉంది.

7. ప్రతిరోజూ 100 ఉచితంగా 100 ఎస్ఎమ్‌ఎస్‌లు లభిస్తాయి.

మీరు కంపెనీ సైట్, బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్‌కేర్ యాప్ ద్వారా మాత్రమే ఈ ఆఫర్‌ను పొందుతారు. ఇది కాకుండా ఇటీవలే కంపెనీ 5G రోల్ అవుట్‌కు సంబంధించి పెద్ద అప్‌గ్రేడ్ కూడా ఇచ్చింది. బీఎస్ఎన్ఎల్ తన 5G రోల్‌అవుట్‌ను 2025లో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story