Cheapest Recharge Plan: ఊరమాస్ ప్లాన్ కుమ్మేసింది బాబోయ్.. 11 నెలలు ఫ్రీ కాల్స్..!

Cheapest Recharge Plan: ఊరమాస్ ప్లాన్ కుమ్మేసింది బాబోయ్.. 11 నెలలు ఫ్రీ కాల్స్..!
x

Cheapest Recharge Plan: ఊరమాస్ ప్లాన్ కుమ్మేసింది బాబోయ్.. 11 నెలలు ఫ్రీ కాల్స్..!

Highlights

Cheapest Recharge Plan: భారత ప్రభుత్వ టెలికాం సంస్థ అయిన BSNL తమ కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా కొత్త ప్లాన్‌లను ప్రవేశపెడుతూ ఆకట్టుకుంటోంది.

Cheapest Recharge Plan: భారత ప్రభుత్వ టెలికాం సంస్థ అయిన BSNL తమ కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా కొత్త ప్లాన్‌లను ప్రవేశపెడుతూ ఆకట్టుకుంటోంది. ఇందులో కొన్ని ప్లాన్‌లు చాలా సరసమైనవి. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) ఇప్పుడు నెట్‌వర్క్ అప్‌గ్రేడ్‌లను వేగవంతం చేస్తోంది. దీంతో తక్కువ ధరలోనే రీఛార్జ్ ప్లాన్ లను అందిస్తుంది. ఇప్పటి వరకు ఎన్నో రకాలైన సరసమైన ప్లాన్ లను అందుబాటులోకి తీసుకొచ్చిన కంపెనీ.. ఇప్పుడు మరొక అద్భుతమైన ప్లాన్ ను ప్రవేశ పెట్టింది. BSNL సరసమైన ప్లాన్‌ విషయానికొస్తే.. కంపెనీ రూ.1,500 కంటే తక్కువ ధరకు శక్తివంతమైన ప్లాన్‌ను అందిస్తుంది. ఇది మీ అన్ని రీఛార్జ్ అవసరాలను ఈజీగా తీర్చుతుంది. ఈ చవకైన, సరసమైన ప్లాన్ గురించి మరింత తెలుసుకుందాం.

BSNL తన కస్టమర్లకు రూ.1499 ప్లాన్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్ లో దీర్ఘకాలిక వ్యాలిడిటీ, అపరిమిత కాలింగ్, డేటాతో సహా ఇతర ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఈ ప్లాన్ లోని అత్యంత ముఖ్యమైనది దాని వ్యాలిడిటీ అనే చెప్పాలి. కంపెనీ తన కొత్త రూ.1499 ప్లాన్‌లో దాదాపు 11 నెలల చెల్లుబాటును అందిస్తుంది. అంటే మీరు ఒకసారి రీఛార్జ్ చేసుకుంటే 11 నెలల వరకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

అదనంగా ఈ ప్లాన్ లో యూజర్లు అపరిమిత వాయిస్ కాలింగ్‌ను కూడా పొందొచ్చు. దీంతో పాటు మీరు భారతదేశంలోని ఏ మూలకైనా మీకు కావలసినన్ని కాల్స్ చేసుకోవచ్చు. అదే సమయంలో మీ ప్రియమైనవారితో హ్యాపీగా మాట్లాడుకోవచ్చు. అంతేకాకుండా ఈ ప్లాన్‌లో 24GB డేటా కూడా పొందొచ్చు. దీనిని మీ ఫోన్ ఇంటర్నెట్ అవసరాలకు ఉపయోగించవచ్చు. అయితే ఈ ప్లాన్ ప్రయోజనాలు అక్కడితో ముగియలేదు.. BSNL నుండి ఈ దీర్ఘకాలిక వ్యాలిడిటీ ప్లాన్ లో రోజుకు 100 SMSలను కూడా పొందవచ్చు. ఇలా 11 నెలల పాటు మీరు ఈ ప్రయోజనాలు పొందుతారు. ఎయిర్ టెల్, జియో వంటి కంపెనీలతో పోల్చుకుంటే.. బీఎస్ఎన్ఎల్ కంపెనీ దీర్ఘకాలిక రీఛార్జ్ ప్లాన్ బెస్ట్ అనే చెప్పాలి.

ఈ BSNL ప్లాన్ నెలవారీ రీఛార్జ్‌ల ఇబ్బంది నుండి విముక్తి చేస్తుంది. ఇది అనేక రకాల ప్రయోజనాలను కూడా అందిస్తుంది. మొత్తంమీద ఈ ప్లాన్ వినియోగదారుడి దాదాపు ప్రతి అవసరాన్ని తీర్చే స్మార్ట్ ప్లాన్. ఈ ప్లాన్ గురించి మరింత సమాచారం కోసం, మీరు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories