BSNL 90 Days Plan: బీఎస్‌ఎన్‌ఎల్‌ చౌకైన ప్లాన్‌.. 90 రోజుల వ్యాలిడిటీ ఇతర ప్రయోజనాలు..!

BSNL 90 Days Plan: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తక్కువ ఖర్చుతో వినియోగదారులకి మెరుగైన సేవలు అందిస్తుంది.

Arun Chilukuri
Published on: 11 Aug 2023 5:27 PM IST
BSNL Cheapest Plan 90 Days Validity and Other Benefits Available
X

BSNL 90 Days Plan: బీఎస్‌ఎన్‌ఎల్‌ చౌకైన ప్లాన్‌.. 90 రోజుల వ్యాలిడిటీ ఇతర ప్రయోజనాలు..!

BSNL 90 Days Plan: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తక్కువ ఖర్చుతో వినియోగదారులకి మెరుగైన సేవలు అందిస్తుంది. సామాన్య ప్రజలని దృష్టిలో పెట్టుకొని రీఛార్జ్‌ ప్లాన్లని రూపొందిస్తుంది. ఇతర టెలికాం కంపెనీలతో పోలిస్తే ధరలు చాలా తక్కువగా ఉంటాయి. జియో, ఎయిర్‌టెల్‌తో పోటీపడే అనేక ప్లాన్‌లు కూడా ఇందులో ఉన్నాయి. తక్కువ ఖర్చుతో గరిష్ట ప్రయోజనాలను అందించడమే దీని లక్ష్యం. 90 రోజుల వ్యాలిడిటికీ సంబంధించిన ఒక చౌకైన ప్లాన్‌ గురించి తెలుసుకుందాం.

90 రోజుల ప్లాన్ సరైందేనా..?

90 రోజుల ప్రీపెయిడ్ ప్లాన్ చాలా మంచి ఎంపిక. దీనివల్ల తరచుగా రీఛార్జ్‌ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అధిక ధరలకి ఇతర కంపెనీలు అందించే 84-రోజుల ప్లాన్ కంటే మెరుగైనదని చెప్పవచ్చు. కానీ ఈ ప్లాన్‌లో నెగిటివ్‌ ఏంటంటే 4G లేని ప్రదేశాలలో 3G ప్రయోజనం మాత్రమే లభిస్తుంది.

BSNL రూ. 439 ప్లాన్

భారతదేశంలో కాల్స్ చేయడానికి సరసమైన నమ్మదగిన ప్రీపెయిడ్ ప్లాన్ కోసం చూస్తున్న వారికి BSNL రూ. 439 ప్లాన్ మంచి ఎంపిక. ఈ ప్లాన్‌లో 90 రోజుల వ్యాలిడిటీ, అపరిమిత వాయిస్ కాల్స్‌, ప్రతిరోజు 300 SMSలు వస్తాయి. అయితే ఇది ఎటువంటి డేటాను అందించదు. డేటా అవసరం లేనివారికి ఈ ప్లాన్ మంచి ఎంపిక అవుతుంది. ఇది చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. BSNL దేశంలో విస్తృత కవరేజీని కలిగి ఉన్నవిషయం తెలిసిందే.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story