BSNL చౌకైన 30 రోజుల ప్లాన్.. కేవలం 16 రూపాయలు మాత్రమే..!

BSNL: BSNL భారతదేశంలోని వినియోగదారులకు అత్యంత సరసమైన 30 రోజుల ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందిస్తుంది.

Arun Chilukuri
Updated on: 5 April 2022 6:00 PM IST
BSNL Cheap 30 Day Plan Only 16 Rupees
X

BSNL చౌకైన 30 రోజుల ప్లాన్.. కేవలం 16 రూపాయలు మాత్రమే..!

BSNL: BSNL భారతదేశంలోని వినియోగదారులకు అత్యంత సరసమైన 30 రోజుల ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్ కేవలం 16 రూపాయలు మాత్రమే. దీని వాలిడిటీ 30 రోజులు ఉంటుంది. ఈ ప్లాన్‌లో SMS, డేటా ప్రయోజనాలు ఏవీ ఉండవు. మీరు BSNL సిమ్‌ని యాక్టివ్‌గా ఉంచాలనుకుంటే ఈ ప్లాన్ మీకు సూపర్‌గా పనిచేస్తుంది. ఇది కాకుండా BSNL ఇంకా చాలా ప్లాన్‌లను కలిగి ఉంది.

BSNL రూ.147 ప్లాన్

మీకు 30 రోజుల వ్యాలిడిటీతో వచ్చే BSNL ప్రీపెయిడ్ ప్లాన్ కావాలంటే STV147 మంచి ఎంపిక. ఇది వినియోగదారుల కోసం డేటా, వాయిస్ కాలింగ్ ప్రయోజనాలతో వస్తుంది. ఈ ప్లాన్‌తో వినియోగదారులు అపరిమిత వాయిస్ కాలింగ్‌తో పాటు 10GB డేటా, BSNL ట్యూన్‌లను పొందుతారు. ఈ ప్లాన్‌లో ఎలాంటి SMS ప్రయోజనం ఉండదు.

BSNL రూ.247 ప్లాన్

మీరు కొంచెం ఎక్కువ చెల్లించగలిగితే మీరు BSNL నుంచి రూ. 247 ప్లాన్‌కు వెళ్లవచ్చు. ఈ ప్లాన్ వినియోగదారులకు SMS ప్రయోజనాలను అందిస్తుంది. వినియోగదారులు అపరిమిత వాయిస్ కాలింగ్‌తో 50GB డేటాను, BSNL ట్యూన్స్, ఈరోస్ నౌ ఎంటర్‌టైన్‌మెంట్ సేవలతో రోజుకు 100 SMSలను పొందుతారు.

BSNL రూ.299 ప్లాన్

ఇది మీరు BSNL నుంచి పొందగలిగే మరో ఉత్తమమైన ప్రత్యేక టారిఫ్ వోచర్ (STV). ఈ ప్లాన్‌తో వినియోగదారులు రోజుకు 3GB డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, 100 SMS/రోజు పొందుతారు. ఫెయిర్ యూసేజ్ పాలసీ (FUP) డేటా గడువు ముగిసిన తర్వాత ఇంటర్నెట్ వేగం 80 Kbpsకి పడిపోతుంది. ఈ సమయంలో వోడాఫోన్ ఐడియా (Vi), భారతి ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో వంటి టెలికాం ఆపరేటర్లు కూడా 30, 31 రోజుల వ్యాలిడిటీతో ప్రీపెయిడ్ ప్లాన్‌లని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story