BSNL Offer: పెరిగిన ఛార్జీల నుంచి ఉపశమనం.. బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి సూపర్‌ ప్లాన్‌..!

BSNL 249 Plan Details: బీఎస్‌ఎన్‌ఎల్‌ కొత్తగా రూ. 249 ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 2 July 2024 3:42 PM IST
BSNL Offering New Recharge Plan RS 249, Check Here for Full Details
X

BSNL Offer: పెరిగిన ఛార్జీల నుంచి ఉపశమనం.. బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి సూపర్‌ ప్లాన్‌..!

BSNL 249 Plan Details: దేశంలో అన్ని టెలికం సంస్థలు ఛార్జీలను భారీగా పెంచిన విషయం తెలిసిందే. దేశంలో ఉన్న మూడు ప్రధాన సంస్థలు జియో, ఎయిర్‌టెల్‌, వొడాపోన్‌ఐడియాలు భారీగా టారిఫ్‌లను పెంచాయి. ఏకంగా 15 నుంచి 25 శాతం వరకు ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ఛార్జీలను కంపెనీలన్నీ జులై 4వ తేదీ నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు ప్రకటించాయి.

ఈ నేపథ్యంలో ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన బీఎస్‌ఎన్‌ఎల్‌ యూజర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్‌ చెప్పింది. తక్కువ ధరలో మంచి బెనిఫిట్స్‌తో కూడిన రీఛార్జ్‌ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. బీఎస్‌ఎన్‌ఎల్‌ కొత్తగా రూ. 249 ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని నెట్‌వర్క్‌లకు అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ చేసుకోవచ్చు. రోజుకు 2 జీబీ చొప్పున డేటా లభిస్తుంది. ఈ లెక్కన మొత్తం 90 జీబీ డేటా పొందొచ్చు. అలాగే రోజుకు 100 ఉచిత ఎస్‌ఎమ్‌ఎస్‌లు లభిస్తాయి.

ప్రస్తుతం అన్ని నెట్‌వర్క్‌లతో పోల్చితే ఇదే బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఈ రీఛార్జ్‌తో లభించే బెనిఫిట్స్‌ ఒకేలా ఉన్నప్పటికీ వ్యాలిడిటీ విషయంలో మాత్రం బీఎస్‌ఎన్‌ఎల్‌ బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. మరో ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌లో కూడా ఈ ప్లాన్‌ ఉంది. అయితే ఇందులో రోజుకు కేవలం 1 జీబీ మాత్రమే లభిస్తుంది. అలాగే వ్యాలిడిటీ కూడా 28 రోజులు మాత్రమే ఉంటుంది. దీంతో ఈ ప్లాన్‌లో అదనంగా 17 రోజుల వ్యాలిడిటీ పొందొచ్చు. మార్కెట్లో ప్రస్తుతం నెలకొన్న పోటీ నేపథ్యంలో యూజర్లను తమవైపు తిప్పకునేందుకు బీఎస్‌ఎన్‌ఎల్ ఈ కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story