Boult Crown Smartwatch: కేవలం రూ.1499లకే సరికొత్త స్మార్ట్‌వాచ్‌.. ఫీచర్లు తెలిస్తే వదిలిపెట్టరు..!

Bolt Crown Smartwatch for Just 1500 Rupees you will be Surprised if you Know the Features
x

Boult Crown Smartwatch: కేవలం రూ.1499లకే సరికొత్త స్మార్ట్‌వాచ్‌.. ఫీచర్లు తెలిస్తే వదిలిపెట్టరు..!

Highlights

Boult Crown Smartwatch: భారతదేశంలో నేడు స్మార్ట్‌వాచ్‌ హవా నడుస్తోంది.

Boult Crown Smartwatch: భారతదేశంలో నేడు స్మార్ట్‌వాచ్‌ హవా నడుస్తోంది. అద్భుతమైన ఫీచర్లతో వినియోగదారులని ఆకట్టుకుంటున్నాయి. అందుకే పెద్ద పెద్ద కంపెనీలు కూడా స్మార్ట్‌వాచ్‌లని తయారుచేసి మార్కెట్‌లో విడుదల చేస్తున్నాయి. తాజాగా బౌల్ట్ క్రౌన్ సరికొత్త స్మార్ట్‌వాచ్‌ను విడుదల చేసింది. ఇది సరిగ్గా ఆపిల్ వాచ్ అల్ట్రా లాగా కనిపిస్తుంది. దీని ధర కేవలం 1500 రూపాయలు మాత్రమే. గొప్ప డిజైన్‌తో పాటు అనేక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇది 1.95-అంగుళాల డిస్‌ప్లే, బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్. IP67 రేటింగ్‌ని కలిగి ఉంటుంది. బౌల్ట్ క్రౌన్ స్మార్ట్ వాచ్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.

భారతదేశంలో బౌల్ట్ క్రౌన్ ధర

బౌల్ట్ క్రౌన్ స్మార్ట్‌వాచ్ భారతీయ వినియోగదారుల కోసం రూ.1,499లకి లభిస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్‌ని కంపెనీ అధికారిక ఆన్‌లైన్ స్టోర్, ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్ నుంచి కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ వాచ్ నాలుగు రంగులలో అందుబాటులో ఉంది. సవన్నా ఆరెంజ్, ఆర్కిటిక్ బ్లూ, కోరల్ ఎల్లో, ఫారెస్ట్ బ్లాక్ రంగులలో లభిస్తుంది.

బౌల్ట్ క్రౌన్ ఫీచర్లు

బౌల్ట్ క్రౌన్ స్మార్ట్‌వాచ్ ప్రకాశవంతమైన డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది 150కి పైగా వాచ్ ఫేస్‌ల ఎంపికను కలిగి ఉంది. తద్వారా నచ్చిన వాచ్ ఫేస్‌ను ఎంచుకోవచ్చు. ఇందులో స్పీకర్, మైక్రోఫోన్ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ స్మార్ట్‌ఫోన్ నుంచి కాల్స్‌ చేయవచ్చు. ఈ పరికరం బ్లూటూత్ 5.2కి సపోర్ట్‌ ఇస్తుంది. 10 మీటర్ల దూరం నుంచి కూడా కాల్‌ చేయవచ్చు.

హార్ట్ రేట్ మానిటర్, SpO2 మానిటర్, ఫిమేల్ మెన్‌స్ట్రువల్ సైకిల్ ట్రాకర్, స్లీప్ మానిటర్, బ్లడ్ ప్రెజర్ మానిటర్, యాక్టివిటీ ట్రాకర్ ఉంటాయి. ఇందులో యంగ్ బర్డ్, హంస్టర్, 2048 పజిల్ గేమ్, బ్యాటిల్‌షిప్ వంటి చిన్న గేమ్‌లు ఆడుకోవచ్చు. బౌల్ట్ క్రౌన్ స్మార్ట్ వాచ్ డిజైన్ యాపిల్ వాచ్ అల్ట్రా మాదిరిగా ఉంటుంది. ఇది చదరపు ఆకారపు డయల్, మెటల్ ఫ్రేమ్‌ను కలిగి ఉంటుంది. డయల్‌ను రక్షించడానికి మెటల్ కీపర్ కూడా ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories