FASTag Recharge: ఫాస్ట్‌ట్యాగ్‌ రీఛార్జ్ చేస్తున్నారా.. లక్షల రూపాయలు ఎగిరిపోతాయి జాగ్రత్త..!

Be Careful While Recharging FASTag Cyber Criminals are Stealing Money From the Account
x

FASTag Recharge: ఫాస్ట్‌ట్యాగ్‌ రీఛార్జ్ చేస్తున్నారా.. లక్షల రూపాయలు ఎగిరిపోతాయి జాగ్రత్త..!

Highlights

FASTag Recharge: ఈ ఇంటర్‌నెట్ యుగంలో సైబర్‌ క్రైమ్‌ కేసులు నానాటికీ పెరిగిపోతున్నాయి.

FASTag Recharge: ఈ ఇంటర్‌నెట్ యుగంలో సైబర్‌ క్రైమ్‌ కేసులు నానాటికీ పెరిగిపోతున్నాయి. డబ్బు కొల్లగొట్టేందుకు హ్యాకర్లు కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. సైబర్ మోసానికి సంబంధించి మరొక కొత్త కేసు తెరపైకి వచ్చింది. ఇది అందరినీ షాక్ గురిచేస్తుంది. ఓ వ్యక్తి నుంచి రూ.లక్ష దోచేసారు. అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.

కర్ణాటకలో కొత్త కేసు వెలుగులోకి వచ్చింది. ఫాస్ట్‌ట్యాగ్‌ని రీఛార్జ్ చేస్తున్నప్పుడు ఓ వ్యక్తి రూ.లక్ష మోసపోయాడు. ఫాస్ట్‌ట్యాగ్‌ని రీఛార్జ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఉడిపిలోని బ్రహ్మవరానికి చెందిన ఫ్రాన్సిస్ పియస్ తన కారులో మంగళూరుకు వెళ్తున్నాడు. అతడు టోల్ ప్లాజాకు చేరుకున్నప్పుడు తన ఫాస్ట్‌ట్యాగ్ కార్డ్‌లో డబ్బు తక్కువగా ఉందని గమనించి టోల్ చెల్లించడానికి హెల్ప్‌లైన్ నంబర్‌లను వెతికాడు. ఇంటర్‌నెట్‌లో సెర్చ్‌ చేయగా ఓ నంబర్‌ కనిపెట్టి రీఛార్జ్‌ చేసుకునేందుకు ఫోన్‌ చేశాడు. ఈ కాల్ తనను మోసానికి గురి చేస్తుందని అతనికి కూడా తెలియదు.

పయాస్ ఫోన్ చేయగా అవతలి వ్యక్తి తనను తాను Paytm Fastag ప్రతినిధిగా పరిచయం చేసుకున్నాడు. రీఛార్జ్ చేయడానికి ఫోన్‌కి వచ్చిన OTPని చెప్పాలని పాయస్‌ని కోరాడు. దీంతో అతడు OTPని షేర్ చేశాడు. కొన్ని నిమిషాల తర్వాత బ్యాంకు ఖాతా నుంచి డబ్బు కట్‌ అయిన మెస్సేజ్‌లు వరుసగా వస్తున్నాయి. ముందుగా రూ.49,000 డెబిట్ కాగా, రూ.19,999, రూ.19,998, రూ.9,999, రూ.1000 డెబిట్ అయ్యాయి. పాయస్ మొత్తం రూ.99,997 నష్టపోయాడు. మోసపోయానని తెలుసుకున్న వెంటనే సదరు వ్యక్తి ఉడిపి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశాడు.

కస్టమర్ కేర్‌కు కాల్ చేస్తే బ్యాంక్ వివరాలను ఏ ప్రతినిధి అడగరు. కాబట్టి OTP లేదా బ్యాంక్ వివరాలను ఎవ్వరికీ చెప్పకూడదు. వెబ్‌సైట్ నిజమైనదా లేదా నకిలీదా అని తనిఖీ చేయడానికి సురక్షిత బ్రౌజింగ్ సాధనాన్ని ఉపయోగిస్తే తెలుస్తుంది. FASTag రీఛార్జ్ చేయడానికి Paytm, ZeePay, PhonePeతో సహా ఏదైనా UPI యాప్‌ని ఉపయోగించి రీఛార్జ్ చేసుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories