ఇది ఇండియాలో చౌకైన డిస్క్‌బ్రేక్ బైక్‌.. మైలేజీ, ఫీచర్లు కూడా సూపర్..!

Bajaj Company Introduced Disc Brake in Bajaj Platina 110 Bike
x

ఇది ఇండియాలో చౌకైన డిస్క్‌బ్రేక్ బైక్‌.. మైలేజీ, ఫీచర్లు కూడా సూపర్..!

Highlights

Bajaj Platina: గత కొన్ని రోజులుగా ఇండియాలో బైకులు డిస్క్ బ్రేక్‌తో వస్తున్నాయి.

Bajaj Platina: గత కొన్ని రోజులుగా ఇండియాలో బైకులు డిస్క్ బ్రేక్‌తో వస్తున్నాయి. వీటిని బైక్‌లలో ఇన్‌స్టాల్ చేయడం ముఖ్య ఉద్దేశ్యం భద్రతను పెంచడమే. అయితే తక్కువ సిసి బైకులలో వేగాన్ని డ్రమ్ బ్రేక్‌లతో నియంత్రించవచ్చు. అయినప్పటికీ బజాజ్ తన ఎంట్రీ లెవల్ బైకులలో ఈ ఫీచర్‌ను అందిస్తోంది. ఇది రైడర్ భద్రతను తదుపరి స్థాయికి తీసుకువెళుతుంది. ఈ రోజు బజాజ్ చౌకైన డిస్క్‌బ్రేక్‌ బైక్ గురించి తెలుసుకుందాం.

ఈ బైకు బజాజ్ ప్లాటినా 110. ఇది చాలా ప్రజాదరణ పొందిన బైక్‌. సాధారణ బైక్‌లతో పోలిస్తే మైలేజీని ఎక్కువగా ఇస్తుంది. అలాంటి టెక్నాలజీని ఇందులో ఉపయోగించారు. కంపెనీ ఈ బైక్‌లో 115.45 సిసి ఇంజన్‌ను అమర్చింది. ఈ ఇంజన్ 7000 rpm వద్ద గరిష్టంగా 6.33 kW శక్తిని, 5000 rpm వద్ద 9.81 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇందులో మీకు 5 స్పీడ్ గేర్‌బాక్స్ లభిస్తుంది. ఈ మోటార్‌సైకిల్ 90 kmph వేగంతో పరుగెడుతుంది.

ఈ బైక్‌లో 11 L కెపాసిటీ గల ఇంధన ట్యాంక్ ఇస్తున్నారు. మీరు బైక్‌ ముందు భాగంలో హైడ్రాలిక్, టెలిస్కోపిక్ ఫోర్క్‌లను పొందుతారు. వెనుక SOS నైట్రోక్స్ వస్తుంది. బ్రేకుల గురించి చెప్పాలంటే ముందు భాగంలో 130 ఎంఎం డ్రమ్, 240 ఎంఎం డిస్క్ బ్రేక్‌లు అమర్చారు. వెనుక భాగంలో 110 ఎంఎం డ్రమ్ బ్రేక్‌లు అందుబాటులో ఉన్నాయి. ధర గురించి మాట్లాడితే కస్టమర్ దీనిని రూ. 69,216 (ఎక్స్-షోరూమ్) ధరతో కొనుగోలు చేయవచ్చు. అందుకే దీనికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories