Network Problems: ఇంట్లో అడుగుపెట్టగానే సిగ్నల్ పోతుందా.. ఇలా సమస్యని పరిష్కరించండి..!

Avoid Signal Problem With Cellular Network Booster Device
x

Network Problems: ఇంట్లో అడుగుపెట్టగానే సిగ్నల్ పోతుందా.. ఇలా సమస్యని పరిష్కరించండి..!

Highlights

Network Problems: ఈ రోజుల్లో చాలామంది స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులు సిగ్నల్స్‌ సమస్యని ఎదుర్కొంటున్నారు.

Network Problems: ఈ రోజుల్లో చాలామంది స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులు సిగ్నల్స్‌ సమస్యని ఎదుర్కొంటున్నారు. కొన్నిసార్లు ఇంట్లో అడుగుపెట్టగానే ఫోన్‌లో సిగ్నల్‌ పోతుంది. దీనివల్ల ఎటువంటి ఫోన్‌ కాల్స్‌, మెస్సేజ్‌లు రావు. ఎత్తైన భవనాలలో నివసించే ప్రజలకు ఈ సమస్య సర్వసాధారణం. ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు మార్కెట్‌లో లభించే ఒక చిన్న పరికరాన్నికొనుగోలు చేసి ఇంట్లో అమర్చుకుంటే సిగ్నల్స్‌ సమస్య ఉండదు. దాని గురించి ఈ రోజు తెలుసుకుందాం.

వాస్తవానికి ఈ పరికరం సిగ్నల్స్‌ బూస్టింగ్ పరికరం. దీని సహాయంతో ఇంట్లో సెల్యులార్ నెట్‌వర్క్ బలాన్ని పెంచవచ్చు. వాస్తవానికి చాలామంది ఇంటిని నిర్మించేటప్పుడు అవసరమైన దానికంటే ఎక్కువ ఎత్తులో లేదా తక్కువ ఎత్తులో నిర్మిస్తారు. దీనివల్ల ఇంట్లోకి సిగ్నల్స్‌ సరిగ్గా రావు. కాల్ చేస్తున్నప్పుడు, ఇంటర్నెట్‌ను ఉపయోగించడం కష్టమవుతుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి ఈ పరికరం బాగా ఉపయోగపడుతుంది.

ఈ సిగ్నల్స్‌ బూస్టింగ్ పరికరం ఆన్‌లైన్‌లో రూ. 3000 నుంచి రూ. 4000 మధ్య సులభంగా లభిస్తుంది. సిగ్నల్ బలహీనంగా ఉన్న చోట దీన్ని ఇన్‌స్టాల్ చేయవచ్చు. ఇది చిన్నదిగా ఉన్నందున ఇంట్లో ఏ మూలనైనా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఇంట్లో ఎన్ని స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నప్పటికీ అందరికీ సిగ్నల్ స్ట్రెంగ్త్ బాగుంటుంది. ఎటువంటి ఇబ్బంది ఉండదు.

Show Full Article
Print Article
Next Story
More Stories