Asus కొత్త ల్యాప్‌టాప్‌ల విడుదల.. ధర, ఫీచర్ల గురించి తెలుసుకోండి..!

Asus New Laptops Released Know About Price Features
x

Asus కొత్త ల్యాప్‌టాప్‌ల విడుదల.. ధర, ఫీచర్ల గురించి తెలుసుకోండి..!

Highlights

Asus AMD Ryzen 7000: ప్రముఖ టెక్‌ దిగ్గజం అసుస్‌ ఇండియన్‌ మార్కెట్లోకి సరికొత్త ల్యాప్‌టాప్‌లని విడుదల చేసింది.

Asus AMD Ryzen 7000: ప్రముఖ టెక్‌ దిగ్గజం అసుస్‌ ఇండియన్‌ మార్కెట్లోకి సరికొత్త ల్యాప్‌టాప్‌లని విడుదల చేసింది. Asus AMD Rezen 7000 సిరీస్‌లో పలు ల్యాప్‌టాప్‌లని లాంఛ్‌ చేసింది. ఇందులో ZenBook 14 OLED, VivoBook Go 15 OLED వంటి మోడల్‌లు ఉన్నాయి. వీటి ధరలు, స్పెసిఫికేషన్‌ల గురించి పూర్తిగా తెలుసుకుందాం.

Asus ZenBook 14 OLED: ఈ ల్యాప్‌టాప్‌ 14-అంగుళాల HDR OLED ప్యానెల్‌ను కలిగి ఉంటుంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. 65W ఫాస్ట్ ఛార్జర్‌తో 75WHr బ్యాటరీని కలిగి ఉంటుంది. AMD రైజెన్ సిరీస్ ల్యాప్‌టాప్‌లు 16GB RAM, 1TB PCIe Gen 3 SSD వరకు స్టోరేజ్‌ని పొందుతాయి. బ్యాక్‌లిట్ చిక్లెట్ కీబోర్డ్‌తో వచ్చే ల్యాప్‌టాప్ ప్రారంభ ధర రూ.89,990గా నిర్ణయించారు.

Asus VivoBook Go 14 OLED: Vivobook Go 14 ల్యాప్‌టాప్ 14 అంగుళాల FHD IPS డిస్‌ప్లేతో వస్తుంది. దీనికి AMD Ryzen 7020 సిరీస్ ప్రాసెసర్ సపోర్ట్‌ ఉంటుంది. 16GB RAM, 512GB వరకు PCIe Gen 3 SSD స్టోరేజ్‌ ఉన్న ల్యాప్‌టాప్ 45W ఛార్జర్‌తో 42Whr బ్యాటరీని కలిగి ఉంటుంది. దీని ప్రారంభ ధర రూ.42,990గా నిర్ణయించారు.

Asus VivoBook Go 15 OLED: VVBook Go 15 OLED 15.6-అంగుళాల HDR OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ ల్యాప్‌టాప్ 50Whr బ్యాటరీ, 60W ఫాస్ట్ ఛార్జర్‌ని పొందుతుంది. AMD Ryzen 5 7520 U ప్రాసెసర్ Asus ల్యాప్‌టాప్‌లో సపోర్ట్ చేయబడింది. వినియోగదారులు ఇందులో 16GB RAM, 512GB SSD స్టోరేజ్‌ని పొందుతారు. దీని ధర రూ.50,990 నుంచి రూ.64,990 వరకు ఉంటుంది.

Asus VivoBook Go 15X OLED: 15.6 అంగుళాల HDR OLED డిస్ప్లే Vivobook 15X OLEDలో అందుబాటులో ఉంటుంది. ఇందులో 50Whr బ్యాటరీ, 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. వినియోగదారులు దీనిలో AMD Ryzen 7 7730U ప్రాసెసర్ సపోర్ట్‌ని పొందుతారు. ఇది కాకుండా 16GB RAM, 1TB వరకు SSD స్టోరేజ్‌ ఉంటుంది. ల్యాప్‌టాప్‌ల ధర రూ.66,990 నుంచి రూ.74,990 వరకు ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories