21 ఏళ్ల వయసులో శ్రీరాముడు ఇంత అందంగా ఉండేవారట.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ చేసిన అద్భుతం..!

Artificial Intelligence Has Created A Beautiful, Mesmerizing Images Of Lord Rama At The Age Of 21
x

21 ఏళ్ల వయసులో శ్రీరాముడు ఇంత అందంగా ఉండేవారట.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ చేసిన అద్భుతం..!

Highlights

Ai Created Lord Ram Images: పురుషోత్తముడైన శ్రీరాముడు. ఎలాంటి వారు. ఎటువంటి జీవితాన్ని గడిపారు.

Ai Created Lord Ram Images: పురుషోత్తముడైన శ్రీరాముడు. ఎలాంటి వారు. ఎటువంటి జీవితాన్ని గడిపారు. ఆయన రాజ్యం ఎలా ఉండేది. అన్న విషయాలు అందరికి తెలుసు. చాలా సినిమాలు, సీరియల్స్ రాముడు గురించి అనేక రకాలుగా చూపించాయి. కానీ సాధారణంగా మనం చూసే రాముడు ఎప్పుడూ ఒక్కటే రూపు. మరి అసలు శ్రీరాముడు ఎలా ఉండే వారు? ఇదిగో ఈ ప్రశ్నకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ai) సమాధానం చెప్పింది. 21 ఏళ్ల వయస్సులో శ్రీరాము ఇలాగే ఉండేవారంటూ ఓ ఫోటోను జనరేట్ చేసింది

చాట్ జీపీటీ, బార్డ్ పేరుతో రోజురోజుకి కొత్త ఆవిష్కరణలకు వేదికగా మారుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత టెక్నాలజీ 21 ఏళ్ల వయస్సులో శ్రీరాముడు ఇలా ఉండేవారంటూ ఓ ఫోటోను తయారు చేసింది. ఆ ఫోటోని ట్విటర్ యూజర్ జితేంద్ర నగర్ విడుదల చేశారు. ప్రస్తుతం ఆ ఫోటో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

శ్రీరాముడి అందానికి శ్రీకృష్ణుడు ఫిదా

వాల్మీకి రామాయణం, రామచరితమానస్, ఆధారంగా ఏఐ శ్రీరాముడి ఫోటోల్ని జనరేట్ చేసింది. ఏఐ విడుదల చేసిన ఫోటో అందంగా, ఆకర్షణగా ఉంది. మనకు సాధారణంగా అందం అనగానే మనకు జగన్మోహన రూపం, నీలమేఘ శ్యాముడు అని శ్రీకృష్ణుని గురించి చెబుతుంటాం. కానీ ఏఐ విడుదల చేసిన ఫోటో శ్రీకృష్ణుడు సైతం శ్రీరాముడి అందానికి మంత్రముగ్ధులవ్వడం ఖాయం.

భూమి మీద ఇంత అందంగా ఎవరైనా ఉండగలరా!

కుంకుమ పువ్వు రంగు దుస్తులు ధరించి మధురమైన చిరునవ్వుతో ఉన్న శ్రీరాముడి తరహాలో ఈ భూమి మీద అంత అందంగా జన్మించి ఉండరేమోననే నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రామభక్తులు తన్మయత్వానికి గురవుతున్నారు. సాధారణంగా చూసే ఫోటోల కంటే రాముడు అందంగా ఉన్నారంటూ ఆశ్చర్యచకితులవ్వడం విశేషం.

శ్రీరాముడి ఫోటోని ఏఐ ఎలా తయారు చేయగలిగింది!

జెనరేటివ్ AIఅనేది కృత్రిమ మేధస్సు రూపం. మెషిన్ లెర్నిగ్ (mi)అల్గారిథమ్ సాయంతో మనిషి ప్రమేయం లేకుండా ఫోటోలు, సంగీతం, వీడియోలను తయారు చేస్తుంది. ఇప్పుడు అదే ఏఐ శ్రీరాముడి ఫోటోను జనరేట్ చేసింది. ఇందుకు డీప్ లెర్నింగ్ టెక్నాలజీ ఉపయోగపడింది. డీప్ లెర్నింగ్ అంటే? డీప్ ఫేక్ లెర్నింగ్ అని అర్ధం. ఇది మెషిన్ లెర్నింగ్ లో ఒక భాగం. మెషిన్ లెర్నింగ్ ద్వారా వ్యక్తి ఫేస్ ను , వాయిస్ ను రీక్రియేట్ చేసి మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్ ను అప్లయ్ చేసి మరో కొత్త వీడియోని లేదంటే ఫోటోను తయారు చేయొచ్చు. ఇప్పుడు వాల్మికి రామాయణం, రామచరిత మానస్ లో ఉన్న జగదభిరాముడి ఫోటోల్ని రీక్రియేట్ చేయగా వచ్చిందే ప్రస్తుతం మనం చూస్తున్న ఫోటో.

Show Full Article
Print Article
Next Story
More Stories