AC Bumper Offer: ఏసీ కొనుగోలు చేసే ప్లాన్‌లో ఉన్నారా.. బంపర్‌ ఆఫర్‌ వచ్చేసింది..!

AC Bumper Offer: ప్రస్తుతం ఎండలతో జనాలందరూ అల్లాడుతున్నారు. ముఖ్యంగా నగరాలు, పట్టణాల్లో కాంక్రీట్‌ గదుల్లో ఉక్కపోతను భరించలేకపోతున్నారు.

Are you planning to buy an AC A bumper offer has arrived
X

AC Bumper Offer: ఏసీ కొనుగోలు చేసే ప్లాన్‌లో ఉన్నారా.. బంపర్‌ ఆఫర్‌ వచ్చేసింది..!

AC Bumper Offer: ప్రస్తుతం ఎండలతో జనాలందరూ అల్లాడుతున్నారు. ముఖ్యంగా నగరాలు, పట్టణాల్లో కాంక్రీట్‌ గదుల్లో ఉక్కపోతను భరించలేకపోతున్నారు. అందుకే చాలామంది ఏసీలు, కూలర్లు కొనుగోలు చేస్తున్నారు. పవర్‌ బిల్లును పక్కనబెట్టి అందరూ చల్లదనాన్ని కోరుకుంటు న్నారు. అయితే కూలర్లతో పోలిస్తే ఏసీలు కాస్త ఎక్కువ చల్లదనాన్ని ఇస్తాయి అలాగే ధర కూడా ఎక్కువగానే ఉంటుంది. అయినప్పటికీ చాలామంది ఏసీలవైపు మొగ్గు చూపుతున్నారు. కానీ ఇప్పుడు సామాన్యులు కూడా ఏసీలు కొనే అవకాశం వచ్చింది. అవును ప్లిప్‌కార్ట్‌ ఇప్పుడు ఏసీలపై బంపర్‌ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. దాని గురించి ఈ రోజు తెలుసుకుందాం.

ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌ సమ్మర్‌ సేల్‌ పేరుతో భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సేల్‌లో భాగంగా అన్ని రకాల ఎలక్ట్రానిక్‌ ప్రొడక్ట్స్‌పై భారీ సేల్‌ను అందిస్తున్నారు. ఇందులో భాగంగానే ఏసీలపై కూడా ఏకంగా 40 శాతం కంటే ఎక్కువగా డిస్కౌంట్స్‌ను అందిస్తున్నారు. ప్రముఖ ఎలక్ట్రిక్‌ కంపెనీ వోల్టాస్‌ ఏసీపై డిస్కౌంట్‌ లభిస్తోంది. వోల్టాస్‌ 1.5 టన్‌ ఏసీ ధర లాంచింగ్ సమయంలో రూ. 62,000గా ఉండేది. ప్రస్తుతం సేల్‌లో భాగంగా ఈ ఏసీపై ఏకంగా 49 శాతం డిస్కౌంట్‌ను అందిస్తోంది. దీంతో ఈ ఏసీని కేవలం రూ. 31,990కే సొంతం చేసుకోవచ్చు.

అయితే ఆఫర్లు ఇక్కడితో ఆగిపోలేదు. కొనుగోలు సమయంలో అమెజాన్‌ పే ఐసీసీఐసీ బ్యాంకు క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా డిస్కౌంట్‌ను పొందొచ్చు. అలాగే పాత ఏసీలను ఎక్స్ఛేంజ్‌ చేసుకోవడం ద్వారా కూడా డిస్కౌంట్‌ను పొందొచ్చు. ఈ ఆఫర్‌తో ఏసీపై అదనంగా రూ. 3,750 వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది. దీంతో ఈ ఏసీని రూ.29 వేలకే సొంతం చేసుకోవచ్చు. ఆఫర్‌లో భాగంగా ఇన్స్టాలేషన్‌లను కూడా ఉచితంగా అందిస్తోంది. అలాగే ఏడాది పాటు కేర్‌ వారంటీని కూడా అందిస్తుంది. అందుకే ఇప్పుడే త్వరపడండి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story