Iphone16 pro max: లాంచింగ్‌కు సిద్ధమైన ఐఫోన్‌16 ప్రో మ్యాక్స్‌.. కళ్లు చెదిరే ఫీచర్స్‌

Apple planning to launch iphone 16 pro max smartphone in september check here for leaked features
x

Iphone16 pro max: లాంచింగ్‌కు సిద్ధమైన ఐఫోన్‌16 ప్రో మ్యాక్స్‌.. కళ్లు చెదిరే ఫీచర్స్‌ 

Highlights

Iphone16 pro max: లాంచింగ్‌కు సిద్ధమైన ఐఫోన్‌16 ప్రో మ్యాక్స్‌.. కళ్లు చెదిరే ఫీచర్స్‌

Iphone16 pro max: యాపిల్ బ్రాండ్ నుంచి కొత్త ఫోన్‌ వస్తుందంటే చాలు ప్రపంచవ్యాప్తంగా ఒకరమైన బజ్‌ ఉంటుంది. ఐఫోన్‌ లేటెస్ట్ మోడల్‌ కోసం ప్రపంచం ఎదురు చూస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఐఫోన్‌ లెటెస్ట్ సిరీస్‌ లాంచింగ్‌కు సిద్ధమవుతోంది. ఐఫోన్‌16 ప్రో మ్యాక్స్‌ పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఐఫోన్‌16 ప్రో మ్యాక్స్‌ను లాంచ్‌ చేయనున్నారు. ఈ ఫోన్‌ను అధునాతన ఫీచర్స్‌, సరికొత్త డిజైన్‌తో తీసుకొస్తున్నారు. ఐఫోన్‌ 16 ప్రో మ్యాక్స్‌ లాంచ్‌ టెక్‌ వరల్డ్‌లో ఒక పెద్ద ఈవెంట్ కానుంది.

ఇప్పటి వరకు ఐఫోన్‌ సిరీస్‌లో వచ్చిన ఫోన్‌ల కంటే ప్రో మ్యాక్స్‌లో మరిన్ని అధునాతన ఫీచర్లను ఇవ్వనున్నారని తెలుస్తోంది. కంపెనీ ఇప్పటి వరకు ఈ ఫీచర్లకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే తాజాగా నెట్టింట ఈ ఫోన్ ఫీచర్లకు సంబంధించి కొన్ని వివరాలు లీక్‌ అయ్యాయి. వీటి ప్రకారం ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్స్‌ ఉండనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఐఫోన్‌ 16 ప్రో మ్యాక్స్‌ను మరింత ఆకర్షణీయంగా డిజైన్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో 6.9 ఇంచెస్‌తో కూడిన పెద్ద స్క్రీన్‌ను ఇవ్వనున్నారు. మంచి బ్రైట్‌నెస్‌తో తీసుకొస్తుండడంతో ఈ ఫోన్‌ స్క్రీన్‌ స్పష్టంగా కనిపించనుంది. వీడియోలు, మంచి గేమింగ్ అనుభూతి కోసం ఈ స్క్రీన్‌ ఉపయోగపడనుంది. ఇక ఐఫోన్‌16 ప్రో మ్యాక్స్‌లో వేగవంతమైన ఏ18 బయోనిక్‌ ప్రాసెసర్‌ను అందించనున్నారు. దీంతో ఫోన్‌ వేగం పెరగనుంది. మల్టీ టాస్కింగ్‌లోనూ ఫోన్‌ హ్యాంగ్‌ అవ్వదు.

ఇక ఐఫోన్‌ 16 ప్రో మ్యాక్స్‌లో కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ట్రిపుల్ రెయిర్‌ కెమెరా సెటప్‌తో రానున్నట్లు సమాచారం. ఇందులో 108 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించనున్నారు. వైడ్ యాంగిల్‌తో పాటు టెలిఫోటో లెన్స్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది. దీంతో లాంగ్‌ డిస్టెంట్స్‌లో ఉన్న వస్తువులను కూడా స్పష్టంగా క్యాప్చర్‌ చేయొచ్చు. రాత్రి సమయంలో కూడా ఫొటోలు అద్భుతంగా తీసుకోవచ్చు. ఇక బ్యాటరీకి కూడా అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. వైర్‌లెస్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే ఈ ఫోన్‌లో 4500 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories