Apple Event: టెక్ ప్రియులకు గుడ్ న్యూస్..యాపిల్ ఈవెంట్ డేట్ వచ్చేసిందోచ్

Apple Event:యాపిల్ ఐఫోన్ లవర్స్ గుడ్ న్యూస్. ఎట్టకేలకు వీరి నిరీక్షణ ముగిసింది. రాబోయే ఐఫోన్ లైనప్ ప్రారంభ తేదీని కంపెనీ ప్రకటించింది. ఈ ఈవెంట్ సెప్టెంబర్ 9న నిర్వహించనున్నట్లు యాపిల్ ప్రకటించింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 27 Aug 2024 12:17 AM IST
Apple 16 smartphone launch day announcement will be released on September 9, the company announced
X

Apple Event: టెక్ ప్రియులకు గుడ్ న్యూస్..యాపిల్ ఈవెంట్ డేట్ వచ్చేసిందోచ్

Apple Event: ఎట్టకేలకు యాపిల్.. రాబోయే ఐఫోన్ లైనప్ ప్రారంభ తేదీని ప్రకటించింది. సెప్టెంబర్ 9న కంపెనీ ఈ ఈవెంట్‌ను నిర్వహించనున్నట్లు పేర్కొంది. ప్రతిసారీ లాంచ్ కాలిఫోర్నియాలోని కుపెర్టినోలో ఉన్న ఆపిల్ పార్క్‌లో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఎప్పటిలాగే 'టిమ్ కుక్' ఈ ఈవెంట్‌ను హోస్ట్ చేయనున్నారు. కంపెనీ ఈ సారి ఈవెంట్ థీమ్‌ను కూడా రిలీజ్ చేసింది. ఈసారి థీమ్ ఇట్స్ గ్లోటైమ్. ఈసారి కంపెనీ తన సిరీస్‌ నుంచి ఐఫోన్ 16ని మార్కెట్‌లో విడుదల చేయబోతోంది. ఇందులో ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మాక్స్ అనే నాలుగు మోడల్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఇయర్‌బడ్‌లు, స్మార్ట్‌వాచ్‌లు కూడా ఉంటాయి.

గత ఏడాది సెప్టెంబర్ 12వ తేదీన కాలిఫోర్నియా వేదిగా ఈ ఈవెంట్ జరిగింది. అంతకముందు ఏడాది సెప్టెంబర్ 7న ఈవెంట్ ను నిర్వహించిన విషయం తెలిసిందే. కాగా ఈ సారి సెప్టెంబర్ 10వ తేదీ నిర్వహించున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే కంపెనీ మాత్రం సెప్టెంబర్ 9న ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు అధికారికంగా సోమవారం ప్రకటించింది.

ఈ ఈవెంట్ లో యాపిల్ ఐఫోన్ 16 సిరీస్, యాపిల్ వాచ్, తోపాటు ఇతర ప్రొడక్టులు కూడా కొత్త హార్డ్ వేర్ ప్రవేశించే ఛాన్స్ ఉంది. ఈవెంట్ ట్యాగ్ లైన్ ను ఇట్స్ గ్లోటైమ్ గా పేర్కొంది. ఇది యాపిల్ ఇంటెలిజెన్స్ ను సూచిస్తుంది. రానున్న ఐఫోన్ 16న సిరీస్ ఫోన్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.


కాగా ఈ ఈవెంట్ సెప్టెంబర్ 9 ఉదయం 10 గంటలకు జరుగుతుంది. ఈ ఈవెంట్ కాలిఫోర్నియాలో జరిగే సమయానికి, భారతదేశంలో రాత్రి 10.30 గంటలు అవుతుంది. ఈ ఈవెంట్ Apple Park నుండి ప్రసారం చేస్తుంది. వినియోగదారులు Apple వెబ్‌సైట్, YouTube ఛానెల్ నుండి ఆన్‌లైన్‌లో చూడవచ్చు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story