Honor 200 5G: హానర్ ఫోటోల ఫోన్.. రూ.8 వేల డిస్కౌంట్‌తో కొనండి!

Honor 200 5G
x

Honor 200 5G

Highlights

Honor 200 5G: మీరు ఫోటోగ్రఫీ కోసం బడ్జెట్‌లో మంచి ఫోన్ కోసం చూస్తున్నట్లయితే.. ఈ సరికొత్త హానర్ స్మార్ట్‌ఫోన్ మీ ఎంపికగా మారచ్చు.

Honor 200 5G: మీరు ఫోటోగ్రఫీ కోసం బడ్జెట్‌లో మంచి ఫోన్ కోసం చూస్తున్నట్లయితే.. ఈ సరికొత్త హానర్ స్మార్ట్‌ఫోన్ మీ ఎంపికగా మారచ్చు. ఈ ఫోన్ శక్తివంతమైన కెమెరా, మంచి బ్యాటరీతో వస్తుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు ఈ ఫోన్‌ను Amazon గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో రూ. 8000 తగ్గింపుతో పొందుతున్నారు. Honor 200 5G ఫోన్ 5200mAh బ్యాటరీ, మూడు 50MP కెమెరాలను కలిగి ఉంది. ఈ నేపథ్యంలో ఫోన్‌పై ఉన్న ఆఫర్లు, డిస్కౌంట్లు తదితర వివరాలు తెెలుసుకుందాం.

ఈ హానర్ ఫోన్ భారతీయ మార్కెట్లో రూ. 34,999 ధరతో ప్రారంభించారు. అయితే ఇది గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా అమెజాన్‌లో రూ. 26,998 తగ్గింపుతో లభిస్తుంది. అంటే ఈ ఫోన్ పై నేరుగా రూ.8,000 తగ్గింపు పొందచ్చు.

ఇది కాకుండా AU క్రెడిట్ కార్డ్ కార్డ్‌ల ద్వారా చెల్లింపుపై రూ.750 తక్షణ తగ్గింపు ఇస్తున్నారు. ఫోన్ బ్లాక్ అండ్ వైట్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. అదే సమయంలో మీరు ఈ ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లో కూడా ఆర్డర్ చేయచ్చు. మీరు రూ. 18,000 వరకు ఎక్స్‌ఛేంజ్ తగ్గింపు ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు. ఇందుకోసం మీ పాత ఫోన్ కండిషన్ బాగుండాలి.

హానర్ 200 ప్రో 5G 6.7 అంగుళాల కర్వ్‌డ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. దీని రిఫ్రెష్ రేట్ 120Hz. ఫోన్‌లో క్వాల్‌కామ్ Snapdragon 7 Gen 3 ప్రాసెసర్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. హానర్ 200 5G 5200mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 100W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.

హానర్ 200 5G ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇది 50MP మెయిన్ లెన్స్, 50MP వైడ్ యాంగిల్, 12MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ సపోర్టింగ్ OISని కలిగి ఉంది. వీడియో కాలింగ్, సెల్ఫీ కోసం ఫోన్‌లో 50mp కెమెరా ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories