Samsung Galaxy S23 Ultra 5G: 200 మెగాపిక్సెల్ ఫోన్‌పై భారీ ఆఫర్.. సగం ధరకే మీ సొంతం చేసుకోవచ్చు..!

Samsung Galaxy S23 Ultra 5G
x

Samsung Galaxy S23 Ultra 5G: 200 మెగాపిక్సెల్ ఫోన్‌పై భారీ ఆఫర్.. సగం ధరకే మీ సొంతం చేసుకోవచ్చు..!

Highlights

Samsung Galaxy S23 Ultra 5G: ఈ కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రాపై భారీ ఆఫర్ ప్రకటించింది.

Samsung Galaxy S23 Ultra 5G: ఈ కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రాపై భారీ ఆఫర్ ప్రకటించింది. ఈ ఫోన్‌లో 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, క్వాడ్ హై డెఫినిషన్ ప్లస్ డైనమిక్ AMOLED 2x డిస్‌ప్లే ఉంది. ఈ-కామర్స్ సైట్‌ డిస్కౌంట్స్‌తో పాటు, బ్యాంక్ ఆఫర్‌లను అందిస్తుంది. ఈ ఫోన్‌పై అందుబాటులో ఉన్న ఆఫర్‌లు, ఫీచర్స్ తదితర వివరాలు తెలుసుకుందాం.

Samsung Galaxy S23 Ultra 5G Specifications

గెలాక్సీ ఎస్23 అల్ట్రా 5Gలో 6.8-అంగుళాల QHD+ డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లే ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌‌ క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 SoC ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. కెమెరా సెటప్ విషయానికి వస్తే.. 200-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 12-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 10-మెగాపిక్సెల్ టాండమ్ షూటర్‌ ఉంది.

సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఫోన్‌లో 5,000mAh బ్యాటరీ ఉంది. ఈ బ్యాటరీ 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఇతర ఫీచర్లలో Wi-Fi 6e, బ్లూటూత్ 5.3, USB టైప్-C పోర్ట్ వంటి కనెక్టివిటీ ఉన్నాయి.

Samsung Galaxy S23 Ultra 5G Offers

గెలాక్సీ ఎస్23 అల్ట్రా 5జీ 12GB/256GB స్టోరేజ్ వేరియంట్ ఇప్పుడు అమెజాన్‌లో రూ.71,899కి అందుబాటులో ఉంది. కంపెనీ ఈ మొబైల్‌ని రూ.1,24,999కి లాంచ్ చేసింది. బ్యాంక్ ఆఫర్లలో ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై రూ. 2,000 తక్షణ తగ్గింపు ఇస్తుంది.

అంతే కాకుండా ఈ సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా 5జీ మొబైల్‌పై రూ. 27,350 వరకు ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ కూడా అందిస్తుంది. అయితే ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ అనేది.. మీ పాత ఫోన్ పర్ఫామెన్స్‌, మోడల్‌పై ఆధారపడి ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories